దొంగలకు వింత అనుభవం.. ఆలయ హుండీ చోరి చేశారు.. తెరిచి చూస్తే షాక్ అయ్యారు..!

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో దొంగలకు వింత అనుభవం ఎదురైంది. నిండుగా ఉండే ఆలయం హుండీపై కన్నేసిన దొంగలకు నిరాశ ఎదురైంది. చివరికి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డారు.

దొంగలకు వింత అనుభవం.. ఆలయ హుండీ చోరి చేశారు.. తెరిచి చూస్తే షాక్ అయ్యారు..!
Hundi Theft
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 18, 2024 | 9:13 PM

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో దొంగలకు వింత అనుభవం ఎదురైంది. నిండుగా ఉండే ఆలయం హుండీపై కన్నేసిన దొంగలకు నిరాశ ఎదురైంది. చివరికి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డారు.

గొల్లపల్లి శ్రీలలితాంబిక తపోవన దేవాలయంలో ఇటీవలే హుండీ చోరి ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో ఆలయంలోకి చొరబడి హుండీని ఎత్తుకెళ్ళారు దొంగలు. అప్పటిదాకా హుషారుగా హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు తాళం విరగొట్టి చూడడంతో షాక్ కు గురయ్యారు. హుండీలో ఎటువంటి డబ్బులు లేకపోవడంతో చోరీకి పాల్పడ్డ దుండగులు నిరాశతో హుండీని ఆలయ ప్రాంగణంలో పడేసి పరారయ్యారు.

అయితే ఆలయానికి ఈ మధ్య కాలంలో రద్దీ తక్కువగా ఉంది. దీనికి తోడు వచ్చేటువంటి భక్తులు హుండీలో కన్న పూజరుల పళ్ళెంలోనే నగదును వేస్తున్నారు. దీంతో హుండీలో పెద్దగా నగదు లేదు. అయితే అసలు విషయం తెలియని దొంగలు హుండీలో భారీగా నగదు ఉంటుందని భావించారు. ఇక చోరీ ఘటన అనంతరం ఆలయ నిర్వాహకులు ఆలయంలోకి వెళ్లి చూడగా హుండీ లేకపోవడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారు. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి -44 కు అనుకొని ఉన్న ఈ ఆలయంలో చోరి ఘటన కలకలం రేపుతోంది.

విషయం పోలీసులకు తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించారు. దీంతో దుండగులు చోరీకి పాల్పడిన దృశ్యాలు సిసి కెమెరాలలో రికార్డు కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఆలయంలో చోరీకి గురైన హుండీలో ఎలాంటి డబ్బులు లేవని పోలీసులు తెలిపారు. అయినా కూడా హుండీ చోరీకి గురి కావడంతో సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. దుండగులను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని జడ్చర్ల పట్టణ సిఐ ఆదిరెడ్డి తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..