Hyderabad: ఎంతకు తెగించార్రా..! హత్య మిస్టరీ వీడక ముందే డెడ్ బాడీ మీద బంగారం మాయం!
హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్‌లో రెండు రోజుల క్రితం ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికంగా ఎల్లారెడ్డిగూడెం నివాసం ఉంటున్న సుధారాణి హత్యకు గురైంది.
హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్‌లో రెండు రోజుల క్రితం ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికంగా ఎల్లారెడ్డిగూడెం నివాసం ఉంటున్న సుధారాణి హత్యకు గురైంది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుధారాణి భర్త ఒక ఆర్ఎంపీ డాక్టర్. భర్త హాస్పిటల్‌కు వెళ్ళగా సుధారాణి పిల్లలు ఇద్దరు ట్యూషన్‌కు బయటికి వెళ్లారు. అయితే పిల్లలు తిరిగి వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి ఆందోళన చెందారు. వెంటనే వారి తండ్రికి సమాచారం అందించడంతో అందరూ కలిసి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సుధారాణిని హత్య చేసి పరారైన దుండగుడు, ఆమె ఒంటి మీద ఉన్న బంగారాన్ని సైతం దోచుకున్నారు. సుధారాణి ఒంటిపై ఉన్న 12 తులాల బంగారం మాయమైంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుధారాణి నివాసానికి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను వెరిఫై చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ ఏసిపి వెంకటగిరి తెలిపారు .
ఒక మరోవైపు సుధారాణిని బంగారం కోసమే హత్య చేశారా? లేదంటే ఇందులో మరో కోణం ఉందా? అనే దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. సుధారాణి భర్త ఉమామహేశ్వరరావు స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్నారు. పోలీసులు అయన స్టేట్‌మెంట్ సైతం రికార్డ్ చేశారు. సోమవారం(సెప్టెంబర్ 30) రాత్రి రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి మొదట ఇద్దరు పిల్లలు వారి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే పక్కా ప్లాన్ ప్రకారమే సుధారాణిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఎవరూ లేరు అని తెలుసుకున్న తర్వాతనే ఇంటి లోపలికి ప్రవేశించి, సుధారాణిపై దాడి చేసి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
దీంతో తెలిసిన వ్యక్తులే సుధారాణిని హత్య చేసి ఉంటారని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. సాయంత్రం సమయం అది కూడా ఇంట్లో ఎవరూ లేరు అనే విషయం నిర్ధారించుకున్న తర్వాతే నిందితులు ఇంటి లోపలికి ప్రవేశించి హత్య చేసి బంగారాన్ని దోచుకెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..