Telangana: మందు బాబులకు షాకింగ్ న్యూస్.. ఆ గ్రామస్తుల సంచలన నిర్ణయం!

ఒక రాష్ట్రంలో తాజాగా మద్యం పాలసీ, మరో రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రముఖంగా ఉంటుంది. వీటన్నిటి నడుమ ఒక గ్రామం పూర్తిగా మద్యాన్ని నిషేధించాలని కోరుకుంది. మద్యం నిషేధం అమలు కోసం గ్రామస్తులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు

Telangana: మందు బాబులకు షాకింగ్ న్యూస్.. ఆ గ్రామస్తుల సంచలన నిర్ణయం!
Liqour Ban
Follow us
Vijay Saatha

| Edited By: Balaraju Goud

Updated on: Oct 02, 2024 | 8:12 PM

ఒక రాష్ట్రంలో తాజాగా మద్యం పాలసీ, మరో రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రముఖంగా ఉంటుంది. వీటన్నిటి నడుమ ఒక గ్రామం పూర్తిగా మద్యాన్ని నిషేధించాలని కోరుకుంది. మద్యం నిషేధం అమలు కోసం గ్రామస్తులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక గ్రామం పూర్తిగా మద్యం అమ్మకాలు, వినియోగాన్ని నిషేధించింది. ఈ నిషేధానికి అనుగుణంగా, ఎవరైనా మద్యం తాగితే లేదా అమ్మితే, వారిపై రూ. 50,000 జరిమానా విధిస్తారు. ఆ నిషేధాన్ని ఉల్లంఘించిన వ్యక్తులకు, కఠినమైన శిక్షలను అమలు చేస్తారు. ముఖ్యంగా, ఎవరైనా మద్యం తాగితే వారికి చెప్పులతో దండ వేస్తామని హెచ్చరించారు.

ఇది ఎక్కడో కాదు తెలంగాణలోని హైదరాబాద్‌కు అత్యంత దగ్గరలో ఉన్న ప్రదేశం. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ దగ్గర ఉన్న కిషన్ నగర్ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామంలోని పెద్దలు, యువకులు కలిసి ఈ నిషేధాన్ని అమలు చేయడానికి ముందుకు వచ్చారు. వారు గ్రామంలో ప్రశాంతతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మద్యం వల్ల గ్రామంలో క్రమశిక్షణ, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు భావించారు. గ్రామస్థులు ఇంతకుముందు జరిగిన గ్రామసభలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇక్కడి గ్రామస్తులు మద్యం అమ్మకం జరిపినవారికి తీవ్ర శిక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. మద్యం విక్రయించే వ్యక్తులను పట్టించిన వారికి నగదు ప్రోత్సాహం కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఎవరైనా మద్యం అమ్మినట్లయితే లేదా వారి సమీపంలో విక్రయించినట్లు తెలియజేసిన వారికి రూ. 1,000 రివార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు. గ్రామమంతటా ఈ నిషేధం గురించి చట్టాన్ని తెలియజేసే బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ల ద్వారా మద్యం తాగిన లేదా విక్రయించిన వారిపై విధించే జరిమానా వివరాలు, ఇతర శిక్షలు పేర్కొన్నారు.

గ్రామస్థులు చెబుతున్నట్లు, మద్యం వినియోగం గ్రామంలో అనేక సమస్యలను తీసుకొస్తోందట. మద్యం తాగిన తర్వాత జరిగిన గొడవలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక క్షిణత వంటి సమస్యలు గ్రామస్థులను ఇబ్బంది పెట్టాయట. ఈ నేపథ్యంలో, గ్రామంలోని పెద్దలు, యువత ఈ నిషేధాన్ని సమర్థిస్తూ, మద్యం పూర్తిగా కట్టడ చేయాని నిర్ణయించారు. ఈ చర్యలు మద్యం వినియోగాన్ని తగ్గించడానికి, గ్రామంలో క్రమశిక్షణను పునరుద్ధరించడానికి తీసుకున్న ప్రయత్నమని స్పష్టమవుతోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..