రాత్రి మిగిలిన చపాతీలు ఉదయం తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇకపై అస్సలు వదిలిపెట్టరు..
రాత్రి మిగిలిపోయిన చపాతీలు పారేయకండి! ఆయుర్వేదం ప్రకారం ఉదయం సద్దె రొట్టె తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి, అధిక ఫైబర్ ఉండటం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, మలబద్ధకం, రక్తపోటు వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. వేడి చేయకుండా తినడం మరింత ప్రయోజనకరం.

చపాతీలు చాలామంది రోజువారీ ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. మధ్యాహ్న భోజనం అయినా రాత్రి భోజనంలో కూడా కొందరు ఆరోగ్య రీత్యా చపాతీలు తింటారు. చాలా సార్లు రాత్రి సమయంలో కొన్ని చపాతీలు మిగిలిపోతాయి. కొందరు వాటిని బయట పారవేస్తారు. లేదా ఎక్కువైనా తింటూ ఉంటారు. కానీ వాటిని ఉదయం తింటే మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.. రాత్రి చేసిన చపాతీల్లో చాలా ఔషద లక్షణాలు ఉన్నాయని అంటున్నారు. ఇవి శరీరానికి మేలు చేస్తాయట. అవేంటో ఇక్కడ చూద్దాం..
రాత్రి మిగిలిన చపాతీలు పోషకాలకు పవర్ హౌస్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా రాత్రి చేసిన చపాతీలు ఉదయాన్నే తినటం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా రాత్రి చేసిన రోటీలు తింటే మంచిది. పాత రొట్టెలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తిన్న తర్వాత ఆకలి వేయదు. ఇది ప్రేగు ఆరోగ్యానికి చాలా మంచిది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
బరువు తగ్గాలని అనుకునేవారు, మధుమేహం ఉన్నవారు బాసీ రోటిని తినడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. రాత్రి పూట నిల్వ చేసిన ప్రతి ఆహారం కిణ్వ ప్రకియకు లోనవుతుంది. కిణ్వ ప్రక్రియ అంటే ఆహారాన్ని పులియబెట్టడం. ఇలాంటి ఆహారంలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది. ఇది గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియను దృఢంగా చేస్తుంది. రోగనిరోధక పనితీరును కూడా మెరుగ్గా ఉంచుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








