Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పులిచింతల ప్రాజెక్ట్‌పై సరసర పాకుతున్న శబ్ధం.. ఒక్కసారిగా చూస్తే షాక్!

పులిచింతలలో రాత్రి సమయంలో అనకోకుండా ఒక కారు ప్రాజెక్ట్ పైకి వచ్చింది. కారు లైట్ల వెలుతురు పడగానే ఒక జంతువు నేలపై వేగంగా కదులుతూ కనిపించింది.

Telangana: పులిచింతల ప్రాజెక్ట్‌పై సరసర పాకుతున్న శబ్ధం.. ఒక్కసారిగా చూస్తే షాక్!
Crocodile
Follow us
T Nagaraju

| Edited By: Balaraju Goud

Updated on: Oct 02, 2024 | 7:29 PM

పులిచింతల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వతో నిండు కుండలా మారింది. గుంటూరు – నల్గొండ జిల్లాల మధ్య ఉన్న ప్రాజెక్ట్ పై నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాకపోకలు సాగుతుంటాయి. భారీ వాహనాలకు అనుమతి లేదు గాని ద్విచక్ర వాహనాలు, స్థానికులు అటు ఇటు రాకపోకలు పులిచింతల ప్రాజెక్ట్ నుండే చేస్తుంటారు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో అనకోకుండా ఒక కారు ప్రాజెక్ట్ పైకి వచ్చింది. కారు లైట్ల వెలుతురు పడగానే ఒక జంతువు నేలపై వేగంగా కదులుతూ కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయిన కారు డ్రైవర్ నీటిలో ఉండాల్సిన మొసలి ప్రాజెక్ట్ పైకి వచ్చినట్లు గుర్తించాడు. అంతేకాకుండా తన సెల్ ఫోన్‌లో మొసలి కదలికలు రికార్డ్ చేశారు.

అనంతరం ఈ విషయాన్ని ప్రాజెక్ట్ సిబ్బందికి చెప్పడంతో వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది మొసలిని తెలంగాణ వైపు నుండి ప్రాజెక్ట్ లోకి వెళ్లేలా చేయగలిగారు. అయితే గతంలోనూ ప్రాజెక్ట్ లో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన సమయంలో పెద్ద పెద్ద రాళ్లపై మొసళ్లు కనిపించాయి. దీంతో ప్రాజెక్ట్ లో మొసళ్ల సంచారం ఉన్నట్లు గుర్తించారు. ఈ సారి ఏకంగా ప్రాజెక్ట్ పైకి రావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. నాగార్జున సాగర్ నుండి పులిచింతల ప్రాజెక్ట్ వరకూ ఉన్న క్రిష్ణా నది తీరంలో మొసళ్ల సంచారం ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. నాగార్జున సాగర్ వద్ద నున్న ఎత్తిపోతల వద్ద కూడా మొసళ్ల సంచారం ఉన్నట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు.

వీడియో చూడండి..

పల్నాడు ప్రాంతంలోని వాగుల్లో కూడా మొసళ్లు కదలికలు గుర్తించారు. తాజాగా పిడుగురాళ్ల వద్ద కూడా రెండు మొసళ్లను గుర్తించిన సిబ్బంది వాటిని కృష్ణా నదిలో వదిలిపెట్టారు. ఈ క్రమంలోనే పులిచింతల రిజర్వాయర్ లో పెద్ద సంఖ్యలో మొసళ్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో సంచరించే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో