Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు ఆచితూచి వ్యవహరించాలి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 3, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం ఆశించినంతగా వృద్ధి చెందుతుంది కానీ, బంధుమిత్రుల మీద ఖర్చులు పెరుగుతాయి. మిథున రాశి వారికి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు ఆచితూచి వ్యవహరించాలి.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 03rd October 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 03, 2024 | 5:01 AM

దిన ఫలాలు (అక్టోబర్ 3, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం ఆశించినంతగా వృద్ధి చెందుతుంది కానీ, బంధుమిత్రుల మీద ఖర్చులు పెరుగుతాయి. మిథున రాశి వారికి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతాయి. ఉద్యోగం జీవితం ఉత్సా హంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహ కారాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో పని భారం పెరిగినా సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆదాయం ఆశించినంతగా వృద్ధి చెందుతుంది కానీ, బంధుమిత్రుల మీద ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవకార్యా లలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సమాధానం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగుల మీద అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకోకుండా కొందరు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులు తప్పకపోవచ్చు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు ఆశించిన ఫలితాలని స్తాయి. అనవసర ఖర్చుల నుంచి బయటపడడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగి పోతుంది. వృత్తి, వ్యాపారాలలో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. మిత్రులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయానికి లోటుండదు. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కొందరు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్త అవ కాశాలు అందివస్తాయి. చేపట్టిన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఆశించిన గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఇతరుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. స్నేహితుల మీద అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకరిద్దరు బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు బాగా పెరుగుతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. పిల్లలు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలకు సమయం అను కూలంగా ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక వ్యవహారాలు తృప్తికరంగా ఉంటాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయాన్ని పెంచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అవుతారు. అధికారులకు నమ్మకం పెరిగి ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): అదనపు ఆదాయ మార్గాల మీద శ్రమ బాగా పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు కానీ కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. కొందరు స్నేహితులకు ఆర్థికంగా సహాయ పడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.
  11. కుంభం (ధనిష‌్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలు నిలకడగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు చక్కబడతాయి. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొందరు ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. సొంత పనుల మీద వీలైనంత శ్రద్ద పెట్టడం మంచిది.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ప్రత్యేక బాధ్యతలను చేపట్టవలసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరు గుతాయి. పని ఒత్తిడి బాగా తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది.

తాగుబోతులు ఈ సీన్ చూస్తే కంటతడి పెడతారు.. గుండె తరుక్కుపోతుంది
తాగుబోతులు ఈ సీన్ చూస్తే కంటతడి పెడతారు.. గుండె తరుక్కుపోతుంది
డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. 2025లో ఈ జాబ్లకు భారీ డిమాండ్!
డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. 2025లో ఈ జాబ్లకు భారీ డిమాండ్!
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్