చంద్ర సంచారంతో వారికి లక్ష్మీ కటాక్షం.. ఆ రాశుల వారి మనసులో కోరికలు తీరే ఛాన్స్..!

ఈ నెల 5 నుంచి 12 వరకు చంద్రుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల్లో సంచారం చేయడం జరుగుతోంది. తులా రాశిలో శుక్రుడితో యుతి, వృశ్చిక, ధనుస్సు, మకర రాశుల్లో గురు, కుజుల దృష్టి వల్ల చంద్రుడు కొన్ని రాశులకు విశేషమైన శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. మనసులోని ఆశలు, కోరికలు తీరే అవకాశం ఉంది. ఈ వారం రోజుల కాలంలో తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి.

చంద్ర సంచారంతో వారికి లక్ష్మీ కటాక్షం.. ఆ రాశుల వారి మనసులో కోరికలు తీరే ఛాన్స్..!
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 03, 2024 | 6:47 PM

ఈ నెల 5 నుంచి 12 వరకు చంద్రుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల్లో సంచారం చేయడం జరుగుతోంది. తులా రాశిలో శుక్రుడితో యుతి, వృశ్చిక, ధనుస్సు, మకర రాశుల్లో గురు, కుజుల దృష్టి వల్ల చంద్రుడు కొన్ని రాశులకు విశేషమైన శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. మనసులోని ఆశలు, కోరికలు తీరే అవకాశం ఉంది. ఈ వారం రోజుల కాలంలో తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం లభించే అవకాశం కూడా ఉంది.

  1. మేషం: ఈ రాశివారికి చంద్రుడు వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ రాశికి చంద్రుడు సుఖ సంతోషాలు, తల్లి, గృహ సౌకర్యం, ఆరోగ్యం, హోదాలకు సంబం ధించిన నాలుగవ స్థానానికి అధిపతి అయినందువల్ల కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపో తుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు వేగంగా పూర్తవుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం లభి స్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి.
  2. వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో చంద్రుడు తులా రాశిలో యుతి చెందడం ఈ రాశివారికి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత ఈ చంద్రుడి మీద కుజ, గురువుల దృష్టి పడడం వల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు పడతాయి. సామాజికంగా రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  3. మిథునం: ఈ రాశికి ధనాధిపతిగా చంద్రుడు మిత్ర క్షేత్రాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ వారం రోజుల కాలంలో ఈ రాశివారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యో గంలో జీతభత్యాలు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ విస్తరిస్తుంది. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  4. కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు చతుర్థ స్థానంలో శుక్రుడితో యుతి చెందడం ఒక విశేషం కాగా, గురు, కుజుల దృష్టి పడడం మరొక విశేషం. ఈ పరిణామాల వల్ల ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఏ పని తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా పైపైకి దూసుకుపోతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. మాతృ సౌఖ్యం కలుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  5. తుల: ఈ రాశికి దశమ స్థానాధిపతిగా చంద్రుడు రాశ్యధిపతి శుక్రుడితో తులా రాశిలో యుతి చెందడం రాజయోగాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా రికార్డులు సృష్టిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మనసు లోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఉద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది.
  6. మీనం: ఈ రాశికి పంచమ స్థానాధిపతిగా చంద్రుడు పూర్తి బలంతో అనుకూల స్థానాల్లో సంచారం చేస్తు న్నందువల్ల అపారమైన ధన లాభం కలుగుతుంది. ఆదాయపరంగానే కాక, ఆస్తి, ఆర్థిక వ్యవహా రాల్లో కూడా ఘన విజయాలు సాధిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి.

ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!