Job Astrology: రవి, కుజుల అనుకూలత.. ఆ రాశుల వారికి అరుదైన ఉద్యోగ యోగాలు

మిత్ర గ్రహాలైన రవి, కుజులు పరస్పరం కేంద్ర స్థానాల్లో, అంటే 1, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాయి. పరస్పర కేంద్రాల్లో ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాలు కొన్ని రాశులకు స్థితిగతులను బట్టి ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు తీసుకువస్తాయి. సాధారణంగా ఈ రెండు గ్రహాలు పరస్పర కేంద్రాల్లో ఉండడం వల్ల మిలిటరీ, పోలీసులు, దర్యాప్తు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వంటి రంగాల వారికి బాగా అదృష్టం పట్టించే అవకాశం ఉన్నప్పటికీ, ఇతర రంగాల్లోని వారికి కూడా అధికార యోగాన్ని కలిగిస్తాయి.

Job Astrology: రవి, కుజుల అనుకూలత.. ఆ రాశుల వారికి అరుదైన ఉద్యోగ యోగాలు
Job Astrology 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 02, 2024 | 6:54 PM

మిత్ర గ్రహాలైన రవి, కుజులు పరస్పరం కేంద్ర స్థానాల్లో, అంటే 1, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాయి. పరస్పర కేంద్రాల్లో ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాలు కొన్ని రాశులకు స్థితిగతులను బట్టి ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు తీసుకువస్తాయి. సాధారణంగా ఈ రెండు గ్రహాలు పరస్పర కేంద్రాల్లో ఉండడం వల్ల మిలిటరీ, పోలీసులు, దర్యాప్తు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వంటి రంగాల వారికి బాగా అదృష్టం పట్టించే అవకాశం ఉన్నప్పటికీ, ఇతర రంగాల్లోని వారికి కూడా అధికార యోగాన్ని కలిగిస్తాయి. ఈ పరస్పర కేంద్ర స్థితి ఈ నెల 17 వరకు కొనసాగుతుంది. మేషం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, ధనూ రాశుల వారికి ఉద్యోగ జీవితం అనేక సానుకూల మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలోనూ, రవి ఆరవ స్థానమైన కన్యారాశిలోనూ సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రత్యేక బాధ్య తలను లేక అధికార బాధ్యతలను చేపట్టవలసి వస్తుంది. ఇష్టమైన ప్రాంతాలకు ఒక హోదాతో బదిలీ కావడం, ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి రావడం, ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందడం వంటివి జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది.
  2. మిథునం: ఇదే రాశిలో సంచారం చేస్తున్న కుజుడితో రవికి కేంద్ర స్థితి ఏర్పడినందువల్ల ఆకస్మిక అధికార యోగానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరింత మంచి ఉద్యోగంలోకి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు.
  3. సింహం: రాశ్యధిపతి రవికి కుజుడితో కేంద్ర స్థితి ఏర్పడడం వల్ల తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. ఉద్యోగులకే కాక, నిరుద్యోగులకు కూడా విదేశాల నుంచి ఊహించని ఆఫర్లు అందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారు తప్పకుండా విజయాలు సాధించడం జరుగు తుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నిస్తున్నవారికి భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది.
  4. కన్య: ఈ రాశిలో ఉన్న రవితో దశమ స్థానంలో ఉన్న కుజుడికి కేంద్ర స్థితి ఏర్పడడం వల్ల ఉద్యోగ జీవితం సానుకూల మలుపులు తిరిగే అవకాశం ఉంది. చిన్న స్థాయి ఉద్యోగి సైతం అందలాలు ఎక్కే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. ఉద్యోగపరంగా కొత్త నైపుణ్యాలలో శిక్షణ పొందడం జరుగుతుంది. ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ది చెందుతాయి. ఉద్యోగరీత్యా ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  5. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడితో లాభస్థానంలో ఉన్న రవికి పరస్పర కేంద్ర స్థితి ఏర్పడడం వల్ల ఉద్యోగ జీవి తంలో అనేక సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. పనితీరు విషయంలో అతి తక్కువ కాలంలో సహోద్యోగులను మించిపోవడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా విస్తృతంగా ప్రయా ణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో ఒక ప్రధాన కేంద్ర బిందువుగా మారడం జరుగుతుంది. విదేశీ అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.
  6. ధనుస్సు: ఈ రాశివారికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడితో దశమ స్థానంలో ఉన్న రవికి కేంద్ర స్థితి ఏర్పడినందువల్ల ఉద్యోగరీత్యా అనేక ప్రయోజనాలు పొందడానికి, ఆస్తిపాస్తులు సమకూర్చు కోవడానికి అవకాశం కలుగుతుంది. అతి తక్కువ కాలంలో ఉద్యోగ స్థిరత్వం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. శీఘ్రగతిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఆఫర్లు అందుతాయి.