Zodiac Signs: గురువుకు ఇష్టమైన కీలక రాశులు.. వారికి ఆదాయం, ఆరోగ్యం..!

ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు వచ్చే ఏడాది మే చివరి వరకూ అదే రాశిలో కొనసాగుతాడు. అదృష్టం, దైవానుగ్రహం, ధనం, పిల్లలు, గృహం, శుభ కార్యాలు వంటి అంశాలకు కారకుడైన గురువు స్థిర రాశి అయిన వృషభ రాశిలో సంచారం చేస్తున్నంత కాలం వృషభంతో సహా ఆరు రాశులను అన్ని విధాలుగానూ కాపాడే ప్రయత్నం చేయడం జరుగుతుంది. గురువు కారకత్వాలు ఈ రాశులకు పూర్తి స్థాయిలో పని చేసే అవకాశం ఉంది.

Zodiac Signs: గురువుకు ఇష్టమైన కీలక రాశులు.. వారికి ఆదాయం, ఆరోగ్యం..!
Zodiac Signs
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 01, 2024 | 7:07 PM

ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు వచ్చే ఏడాది మే చివరి వరకూ అదే రాశిలో కొనసాగుతాడు. అదృష్టం, దైవానుగ్రహం, ధనం, పిల్లలు, గృహం, శుభ కార్యాలు వంటి అంశాలకు కారకుడైన గురువు స్థిర రాశి అయిన వృషభ రాశిలో సంచారం చేస్తున్నంత కాలం వృషభంతో సహా ఆరు రాశులను అన్ని విధాలుగానూ కాపాడే ప్రయత్నం చేయడం జరుగుతుంది. గురువు కారకత్వాలు ఈ రాశులకు పూర్తి స్థాయిలో పని చేసే అవకాశం ఉంది. ఆదాయం, ఆరోగ్యం, సంతానం, పురోభివృద్ధి, సొంత ఇల్లు, పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటివి సానుకూలంగా ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రయత్నాలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు మే వరకు గురువు అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.

  1. వృషభం: గురువు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారిని అన్ని విషయాల్లోనూ అనుగ్రహిం చడం, కాపాడడం జరుగుతుంది. ఆదాయానికి ఇబ్బంది పడే అవకాశం ఉండదు. ఆదాయం పెరగ డమే తప్ప తగ్గడం జరగదు. ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలను దగ్గరకు రానివ్వడు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలకు భంగం ఉండదు. ప్రాభవం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యల నుంచి గట్టెక్కుతారు.
  2. కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడు గురువుకు పరమ విధేయుడైనందువల్ల, పైగా ఈ రాశికి లాభ స్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు, శక్తి సామర్థ్యాలు వెలుగులోకి రావడం వంటివి జరు గుతాయి. గురువు అనుగ్రహంతో ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు ప్రాభవం పెరుగు తుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. లాభదాయక వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా, దృఢంగా ఉంటుంది.
  3. కన్య: ఈ రాశివారికి గురువు గృహ, వాహన సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. అంచనాలకు మించిన ధనాదాయం ఉంటుంది. రావలసిన సొమ్మంతా అప్రయత్నంగా చేతికి అందుతుంది. తీర్థ యాత్రలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు పరిష్కారం అయి విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ముఖ్యమైన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త సమస్యలు దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు.
  4. వృశ్చికం: ఈ రాశివారికి గురువు కలలో కూడా ఊహించని సంపదను ప్రసాదించే అవకాశం ఉంది. ఉద్యో గంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల నుంచి బయటపడడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. సంపన్న కుటుం బానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. సంతాన యోగానికి తప్పకుండా అవకాశం ఉంది.
  5. మకరం: ఈ రాశికి ఏమాత్రం ఊహించని గౌరవ మర్యాదలు, సత్కారాలు లభిస్తాయి. రాజపూజ్యాలు ఎక్కు వగా ఉంటాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. గురువు అనుగ్రహం వల్ల ఇష్టమైన పుణ్యక్షేత్రాలనన్నిటినీ సందర్శించే అవకాశం ఉంది. ఆదాయానికి ఏ మాత్రం లోటుండదు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. సంతానం కలగడానికి అవకాశం ఉంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది.
  6. మీనం: ఈ రాశికి గురువు అనుగ్రహం పూర్తి స్థాయిలో ఉన్నందువల్ల కీలక సమస్యలు పరిష్కారం అయి ఊరట లభిస్తుంది. కొత్త సమస్యలు దరి చేరే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశిం చిన పురోగతి ఉంటుంది. హోదాతో పాటు జీతభత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. నిరు ద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వ్యాపారాలు లాభాల బాటపడ తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.