మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి, అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలు దారికి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా, హుషారుగా గడుపుతారు. ఆదాయానికి లోటుండదు. ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహా రాలు, పనుల్ని సవ్యంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు.