- Telugu News Photo Gallery Spiritual photos Girls born on these dates are ambitious and longing to live luxury life
Girls Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అదృష్టదేవతలు.. కోడలిగా అడుగుపెట్టిన ఇంట సిరి సంపదలు తాండవం చేస్తాయ్!
న్యూమరాలజీ.. ఇది కేవలం గణితానికి మాత్రమే పరిమితం కాదు. చాలా మంది తమ రోజువారీ జీవితంలో న్యూమరాలజీని చాలా దృఢంగా నమ్ముతారు. ఎందుకంటే న్యూమరాలజీ జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారని నిపుణులు చెబుతున్నారు.. అంతేకాదు..
Updated on: Oct 01, 2024 | 9:03 PM

న్యూమరాలజీ.. ఇది కేవలం గణితానికి మాత్రమే పరిమితం కాదు. చాలా మంది తమ రోజువారీ జీవితంలో న్యూమరాలజీని చాలా దృఢంగా నమ్ముతారు. ఎందుకంటే న్యూమరాలజీ జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇవక్క తెలుసుకుందాం..

న్యూమరాలజీ ప్రకారం 2, 11, 20 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ప్రతిష్టాత్మకంగా ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందుకోసం చాలా కష్టపడతారు.

ఇతరులతో వారి రిలేషన్‌షిప్ కూడా చాలా నిజాయితీగా ఉంటుంది. 2, 11, 20 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మంచి భార్యలుగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న పురుషులు నిజంగా అదృష్టవంతులే.

ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ ఇంటికి కోడలిగా వెళ్లినా ఆ ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. వీరు ఎవరి బాధను చూడలేరు. వీరు ధనవంతులైతే ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.

పైన పేర్కొన్న తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి మంచి వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. విలాసవంతంగా జీవించడానికి ఇష్టపడతారు. అలాగే వీరు ఎమోషనల్ వ్యక్తులు.



















