కుర్రాళ్ల గుండెలు అదిరేలా గ్లామర్ డోస్ పెంచేసిన నివేదా.. 

17 December 2025

Pic credit - Instagram

Rajeev 

1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించిన నివేదా.. 2002లో మలయాళం మూవీ ‘ఉత్తర’లో బాలనటిగా తెరంగేట్రం చేసింది.

ఆ తర్వాత సన్ టీవీలో అప్పట్లో ప్రసారమైన మై డియర్ భూతం సీరియల్లోనూ నివేద నటించింది.

ఆ తర్వాత తమిళ్, మలయాళంలో అనేక చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది. 2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్, మీట్ క్యూట్, శాకిని డాకిని, 35 చిత్రాలతో తెలుగు ఆడియెన్స కు బాగా చేరువైంది.

ఈ క్యూటీ మరెవరో కాదు ఇటీవల 35 చిన్న కథ కాదు సినిమాతో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకుంది. 

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని తదిదర స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి పాత్రల్లో నటించిన ఈ అందాల తార ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తోంది.