AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లండన్, అమెరికా అటాక్స్ నుంచి.. బోండీ బీచ్ దాకా..ముష్కరులకు కేరాఫ్‌ భాగ్యనగరం!

హైదరాబాద్ సేఫ్. ఈ ఫీలింగ్ సాధారణ పౌరులతో పాటు ఉగ్రవాదులకు కూడా ఉందా? ఉండే ఉంటుంది. లేకపోతే.. ఎక్కడెక్కడో జరిగిన ఉగ్రదాడులకు హైదరాబాద్‌తో లింక్ ఉండడమేంటి? ఎక్కడ ఉగ్రవాది దొరికినా కొన్నాళ్లపాటు హైదరాబాద్‌లోనే మకాం వేశాడని నిర్దారణ అవడమేంటి? సిటీలో గట్టి నిఘా అయితే ఉంది.. అందులో సందేహమే లేదు. చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేసేంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ.. అలా చిటుక్కునుకుండానే బతికేస్తున్నారు ముష్కరులు. అదే సవాలుగా మారిందా నిఘా వ్యవస్థకి? హైదరాబాద్‌లో పట్టుబడిన టెర్రరిస్టులు గానీ.. ఇది వరకు మకాం వేసి వెళ్లిపోయిన వాళ్లు గానీ చాలా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. వేలుపెడితే కొరకలేడేమో అన్నంత మంచితనంతో, సైలెంట్‌గా వాళ్ల పని వాళ్లు చేసుకుపోయారు. అందుకే అనుమానం రావడం లేదా?

లండన్, అమెరికా అటాక్స్ నుంచి.. బోండీ బీచ్ దాకా..ముష్కరులకు కేరాఫ్‌ భాగ్యనగరం!
Global Terror Links In Hyderabad
Balaraju Goud
|

Updated on: Dec 17, 2025 | 9:54 PM

Share

ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన నిఘా ఉన్న నగరాల్లో ఒకటి.. గ్రేటర్ హైదరాబాద్. నో డౌట్.. పక్కా సేఫ్ సిటీ. వన్ మిలియన్.. అంటే 10 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంటే నాట్ ఏ జోక్. భద్రతలో దేశంలోనే సెకండ్ ప్లేస్.. భాగ్యనగరానిది. వరల్డ్‌వైడ్‌ టాప్-50 సిటీస్‌లోనూ హైదరాబాద్‌కి ప్లేస్ దక్కింది. ప్రతి వెయ్యి మందికి 35 సీసీ కెమెరాలు ఉన్నట్టు లెక్క. దీనికితోడు పోలీసుల బందోబస్తు, పెట్రోలింగ్ వెహికల్స్, డేగకళ్ల లాంటి ఇంటెలిజెన్స్.. ఇదీ హైదరాబాద్ రేంజ్. బట్.. మొన్నామధ్య సైనైడ్ కంటే డేంజర్ అయిన రైసిన్‌తో గుజరాత్‌లో పట్టుబడ్డాడొక ఉగ్రవాది. అతడి పర్మినెంట్ అడ్రస్.. హైదరాబాద్. 2017లో ముగ్గురు కుర్రాళ్లు కశ్మీర్ వెళ్లారు. అనుమానమొచ్చి ఆరా తీస్తే ఐసిస్‌లో చేరడానికి వెళ్తున్నారని తేలింది. ఆ ముగ్గురి కేరాఫ్.. హైదరాబాద్. 2022 దసరా పండగప్పుడు దేశవ్యాప్తంగా ఓ అలర్ట్ వచ్చింది. ఎక్కడో గట్టి ఉగ్రదాడే జరగబోతోందని. అనుమానం వచ్చి ఓ ఇంట్లో చెక్ చేస్తే.. గ్రెనేడ్లు దొరికాయ్. ఎక్కడో కాదది… హైదరాబాద్‌లోనే. అవి చైనాలో తయారై పాకిస్తాన్ వెళ్లి అక్కడి నుంచి సిటీకొచ్చాయ్. బిహార్ దర్భంగా రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై మూడేళ్ల క్రితం బాంబ్ బ్లాస్ట్ జరిగింది గుర్తుందా? బాంబును పార్శిల్ చేసి రైల్లో పంపారు. అదృష్టం.. రైల్లో పేలలేదు. ఇంతకీ ఆ పార్శిల్ ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచే. చివరికి.. అక్కడెక్కడో ఆస్ట్రేలియాలో టెర్రర్ అటాక్ జరిగినా.. ఆ ఉగ్రవాది అడుగులు సైతం...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి