AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ గెలిస్తే తొలి ప్రాధాన్యత దేనికో చెప్పేసిన మంత్రి కోమటి రెడ్డి..

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ 10ఏళ్లు ఆదాని అంబానీలకు దోచి పెట్టారని ఆరోపించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‎లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మాది డబుల్ RR కాదు.. మీది AA టాక్స్ ఆదాని, అంబానీ టాక్స్ అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‎కు 14, బిజేపికి 2 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఒక్కటి గెలవదన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడటం సుద్దదండగ అన్నారు. అగ్గిపెట్టే రావు హరీష్, కేటీఆర్‎లను ఘాటుగా విమర్శించారు.

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ గెలిస్తే తొలి ప్రాధాన్యత దేనికో చెప్పేసిన మంత్రి కోమటి రెడ్డి..
Komatireddy Venkat Reddy
Srikar T
|

Updated on: May 08, 2024 | 2:51 PM

Share

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ 10ఏళ్లు ఆదాని అంబానీలకు దోచి పెట్టారని ఆరోపించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‎లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మాది డబుల్ RR కాదు.. మీది AA టాక్స్ ఆదాని, అంబానీ టాక్స్ అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‎కు 14, బిజేపికి 2 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఒక్కటి గెలవదన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడటం సుద్దదండగ అన్నారు. అగ్గిపెట్టే రావు హరీష్, కేటీఆర్‎లను ఘాటుగా విమర్శించారు. తెలంగాణ కోసం తాను అసలైన దీక్ష చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. చావు దగ్గర స్టేజిలో తనను ఆసుపత్రికి తీసుకెళ్లారని వివరించారు. అసలైన నాయకుడిని తానని చెప్పుకున్నారు. తెలంగాణ వస్తే చాలు తనకు ఏ పదవీ అవసరం లేదు అన్నానని తెలిపారు. అందుకే తన మంత్రి పదవి త్యాగం చేశానన్నారు. హరీష్ రావు రాజీనామా కూడా దొంగ నాటకం అని ఎద్దేవా చేశారు. రైతుల గురించి తప్పుగా మాట్లాడినట్లు నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధం అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‎తో కూడిన తెలంగాణను ఇచ్చిన వ్యక్తి సోనియాగాంధీ అన్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‎ను గెలిపించండని కోరారు. కేసీఆర్ ఎప్పుడు తెలంగాణ కోసం ఉద్యమం చేయలేదని ఆరోపించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో తాము పోరాటం చేశామన్నారు. గతంలో పోలింగ్ రోజు కూడా కెసిఆర్ రైతు బంధు వేశారని.. వారం ముందు నుండి సీఎం రేవంత్ రెడ్డి రైతుల అకౌంట్లో రైతుబంధు నిధులు వేస్తే ఈసీకి ఫిర్యాదు చేసి ఆపారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రాహుల్ గాంధీ మొదటి ప్రాధాన్యత కుల గణన అని.. దానిని కచ్చితంగా చేసి అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి పదవి కాదు.. కనీసం మంత్రి పదవి కూడా అడగలేదని ఈ సందర్భంగా వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం పిలిచి ఇచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పని చేస్తామన్నారు. ఆయనకు సీనియర్ల పట్ల గౌరవం ఉందని చెప్పారు.