AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ గ్రామంలో ఆడపిల్ల పుడితే నగదు డిపాజిట్‌.. ఈ దంపతుల ఆలోచనకు సెల్యూట్

నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియల్‌ గ్రామానికి చెందిన ఓ యువ జంట తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వారి నిర్ణయాన్ని గ్రామస్థులు అభినందిస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుతున్నారు. ‌ మరి ఆ నిర్ణయం ఏంటో తెలుసుకుందాం పదండి...

Telangana: ఆ గ్రామంలో ఆడపిల్ల పుడితే నగదు డిపాజిట్‌.. ఈ దంపతుల ఆలోచనకు సెల్యూట్
Tirupathi Reddy - Sravana Lakshmi
Ram Naramaneni
|

Updated on: May 08, 2024 | 11:50 AM

Share

ఆడపిల్ల అంటే భారం అనుకోవడం అనాగరికం.. ఆడపిల్ల ఇంటికి అదృష్టం. ఎవరో బుద్ది తక్కువవారు, చదువుకున్న కుసంస్కారులు తప్పితే.. ఆడబిడ్డను వద్దనుకునేవారు ఈ సమాజంలో ఉండరు. ఇంకా లింగనిర్ధరణ పరీక్షలు చేసి ఆడపిల్లని తెలియగానే.. అబార్షన్ చేయిస్తున్నారంటే.. అంతకంటే హేయమైన చర్య ఉండదు. ఆడపిల్లల ఖర్చుల కోసం, వారి గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు, వారికి చేదోడుగా నిలిచేందుకు.. నిజామాబాద్ జిల్లా ఎండ్రియల్‌ గ్రామానికి చెందిన ఓ జంట.. గొప్ప నిర్ణయం తీసుకుంది. గ్రామంలో ఆడ పిల్లపుడితే తమ వంతుగా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు రెడ్డిగారి శ్రావణలక్ష్మి, తిరుపతిరెడ్డి దంపతులు.

జనవరి ఒకటి 2024 నుంచి గ్రామంలో జన్మించిన ప్రతి ఆడపిల్లకి తమ వంతు సహాయంగా పోస్టాఫీస్ అకౌంట్ తెరిచి ఒక్కొక్కరికి రూ. 2 వేల నగదును డిపాజిట్‌ చేయనున్నట్లు చెప్పారు. ఆడపిల్లలు వయసుకు వచ్చేసరికి.. ఆ అమౌంట్ పెరుగుతుంది.. అది వారి చదువులు లేదా అవసరాలకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.  తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ జంట ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. వారి నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. స్థోమత ఉన్నవారు ఈ తరహా నిర్ణయం తీసుకుంటే సమాజం బాగుంటుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..