Hyderabad Rains: ఘోరం.. బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. భవన యజమానిపై కేసు నమోదు..

హైదరాబాద్‌లో భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. భారీ వర్షానికి బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడకూలి ఏకంగా ఏడుగురు కార్మికుల మృతి చెందారు. ఈ ఘటనపై బాచుపల్లి ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారుల అంచనాకు వచ్చారు.

Hyderabad Rains: ఘోరం.. బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. భవన యజమానిపై కేసు నమోదు..
Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 08, 2024 | 11:18 AM

హైదరాబాద్‌లో భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. భారీ వర్షానికి బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడకూలి ఏకంగా ఏడుగురు కార్మికుల మృతి చెందారు. ఈ ఘటనపై బాచుపల్లి ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారుల అంచనాకు వచ్చారు. దీంతో ఆరిజన్ కన్‌స్ట్రక్షన్‌ ఎండి అరవింద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు క్షేమంగా ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు స్వరాష్ట్రాలకు తరలించనున్నారు అధికారులు..

బాచుపల్లి ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను సిఎం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాచుపల్లి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాగా.. మంగళవారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడకూలి ఏకంగా ఏడుగురు కార్మికుల మృతి చెందారు. ఆరిజన్ కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు చెందిన ప్రాజెక్టు సైట్‌లో ప్రమాదం జరిగింది. రిటర్నింగ్‌ వాల్‌ నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డీసీపీ శ్రీనివాసరావు చెప్పారు. భవన యజమాని అరవింద్‌రెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు.

వీడియో చూడండి..

మృతులందరూ ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. సెంట్రింగ్‌ పనుల కోసం వచ్చిన కార్మికులు.. కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లోనే రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..