PM Modi: అంబానీ, అదానీ నుంచి ఎంత తీసుకున్నారు.. కాంగ్రెస్ టార్గెట్‌గా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
అంబానీ, అదానీని ఇన్నాళ్లూ విమర్శించారు.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ విమర్శలు ఆగిపోయాయి.. అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది..? అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చారు.. అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుందని ప్రశ్నించిన ప్రధాని మోదీ.. ఈ గుట్టలకొద్దీ డబ్బు గురించి సమాధానం చెప్పాలంటూ నిలదీశారు.
అంబానీ, అదానీని ఇన్నాళ్లూ విమర్శించారు.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ విమర్శలు ఆగిపోయాయి.. అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది..? అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చారు.. అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుందని ప్రశ్నించిన ప్రధాని మోదీ.. ఈ గుట్టలకొద్దీ డబ్బు గురించి సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. వేములవాడలో నిర్వహించిన బీజేపీ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు సంధించారు. బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఫ్యామిలీ ఫస్ట్ అంటూ పేర్కొన్నారు. రెండు పార్టీలు ఒక్కటేనని.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను అవినీతే కలుపుతోందన్నారు. కాంగ్రెస్‌పై ఓటుకు నోటు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్..అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం స్కామ్‌పై చర్యలు తీసుకోవట్లేదు.. అవినీతి సిండికేట్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ భాగస్వాములు అన్నారు.
ప్రధాని మోదీ వీడియో చూడండి..
పీవీని కాంగ్రెస్ అవమానించింది..
కాంగ్రెస్, BRS వారి కుటుంబాల కోసమే పనిచేస్తాయి.. దేశమే ముఖ్యమని భావించే పార్టీ బీజేపీ అని మోదీ అన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును కాంగ్రెస్ అవమానించిందని.. పీవీ భౌతికకాయాన్ని పార్టీ ఆఫీస్‌లోకి అనుమతించలేదంటూ మోదీ మండిపడ్డారు. పీవీకి తమ ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించిందని మోదీ అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలపై కాంగ్రెస్ చిన్నచూపు..
ఈ సందర్భంగా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు గండికొట్టి.. కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్‌కు ఇవ్వాలనుకుంటోందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై కాంగ్రెస్ చిన్నచూపు చూస్తుందని. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలతో ఓబీసీలకు నష్టమని మోదీ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..