PM Modi: ‘ఏడాదికో ప్రధాని’.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై మోదీ చురకలు.
ఎన్డీయే విజయం మొదటి మూడు విడతల్లోనే తేలిపోయిందన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ సీట్లు వెతుక్కోవడానికి మైక్రోస్కోప్ కావాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 40 ఏళ్లక్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళిని, రామప్ప శివుడికి దండం పెట్టుకొని ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఎన్డీయే విజయం మొదటి మూడు విడతల్లోనే తేలిపోయిందన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ సీట్లు వెతుక్కోవడానికి మైక్రోస్కోప్ కావాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 40 ఏళ్లక్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళిని, రామప్ప శివుడికి దండం పెట్టుకొని ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతం కాకతీయుల విజయానికి ప్రతీక అన్నారు. వరంగల్ చారిత్రాత్మకమైన సీటు అని కొనియాడారు. భావితరాల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే మళ్ళీ బీజేపీ రావాలన్నారు. ఫిర్ ఎక్ బార్.. మోడీ సర్కార్ అని నినదించారు. ప్రపంచమంతా అనేక విపత్తులు ఎదుర్కుంటుందని.. దేశం దృష్టశక్తుల చేతుల్లోకి వెళ్లకూడదన్నారు.
10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఎలాంటి పాపలు చేసిందో ప్రజలు మరిచి పోలేదని గుర్తు చేశారు. కుంభకోణాలు.. బాంబ్ బ్లాస్టింగ్స్ కాంగ్రెస్ పాలనలోనే జరిగాయన్నారు. కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు అవుతారని ఎద్దేవ చేశారు. ఈ దేశాన్ని అలాంటి వారి చేతుల్లో పెడదామా..? అని ప్రశ్నించారు. ప్రతీ పార్టీకి ఒక ప్రధానమంత్రి అభ్యర్థి ఉన్నారని.. ఏడాదికి ఓ ప్రధాని చొప్పున ఉంటే ఈ దేశ భవిష్యత్ ఏమై పోతుందో ఆలోచించండని సూచించారు. ఇండియా కూటమికి చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు కోరు అని విమర్శించారు. లోక్ సభ ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ రుణమాఫీ వట్టి మాటే అని తెలిపారు. సనాతన ధర్మాన్ని తిడుతున్న కాంగ్రెస్ నాయకులు దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విశ్వాసఘాతక పార్టీ అని విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ కోతలు పెరిగాయన్నారు. ఇక అభివృద్ధి అయితే ఆగిపోయిందని అలాగే సర్కారు ఖజానా ఖాళీ అయిందన్నారు.
RR ట్యాక్స్ పేరిట..తెలంగాణ ప్రజల డబ్బులు దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ దృష్టిలో రాజ్యాంగానికి విలువ లేదన్నారు. చట్టాన్ని సవరించైనా సరే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని చూస్తుందన్నారు.ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ SC, ST, BC లను విస్మరిస్తుందని ఆరోపించారు. సమ్మక్క సారక్క యునివర్సిటీ నిర్వహణ విషయంలో కాంగ్రెస్ అడ్డుపడుతుందని తెలిపారు. దళిత సామాజికవర్గానికి చెందిన రామ్నాథ్ కొవిద్ను.. రెండోసారి ఆదివాసీని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే అని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..