PM Modi: తెలంగాణలో RR ట్యాక్స్ RRR సినిమాను మించిపోయింది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
శివుడి సన్నిధిలో మోదీ నిప్పులు చెరిగారు. బీజేపీ వేములవాడ సభలో కాంగ్రెస్, BRSపై ప్రధాని మోదీ చెలరేగిపోయారు. తెలంగాణ గట్టు మీద తమ ప్రత్యర్థులిద్దరూ ఒక్కటేనని చాటడానికి ఉదాహరణలు, పంచ్‌లతో ప్రధాని మోదీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కలెక్షన్లలో ట్రిపుల్ ఆర్ సినిమాని డబుల్ ఆర్ ట్యాక్స్ మించిపోయిందని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు.
శివుడి సన్నిధిలో మోదీ నిప్పులు చెరిగారు. బీజేపీ వేములవాడ సభలో కాంగ్రెస్, BRSపై ప్రధాని మోదీ చెలరేగిపోయారు. తెలంగాణ గట్టు మీద తమ ప్రత్యర్థులిద్దరూ ఒక్కటేనని చాటడానికి ఉదాహరణలు, పంచ్‌లతో ప్రధాని మోదీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కలెక్షన్లలో ట్రిపుల్ ఆర్ సినిమాని డబుల్ ఆర్ ట్యాక్స్ మించిపోయిందని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. RRR సినిమా వెయ్యి కోట్లు సాధిస్తే.. RR మాత్రం కొన్ని రోజుల్లోనే ఆ విలువను దాటేసిందన్నారు. RR నుంచి తెలంగాణను విముక్తి చేయాలన్నారు మోదీ.
‘‘RR ట్యాక్స్ అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు.. వసూళ్లలో RRR సినిమాను RR ట్యాక్స్ మించిపోయింది.. RRR సినిమా వెయ్యి కోట్లు సాధిస్తే.. RR మాత్రం కొన్ని రోజుల్లోనే దాటేసింది.. RR నుంచి తెలంగాణను విముక్తి చేయాలి…‘‘- నరేంద్ర మోదీ
వీడియో చూడండి..
అవినీతి సిండికేట్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ భాగస్వాములంటూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఇందుకు రెండు ఉదాహరణలు చెప్పారు.. కాంగ్రెస్‌పై ఓటుకు నోటు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్- అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం స్కామ్‌పై చర్యలు తీసుకోవట్లేదని ప్రధాని మోదీ ఆరోపించారు.
అవినీతిలో కాంగ్రెస్, బిఆర్ఎస్ తోడుదొంగలని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో వ్యవసాయ, ఆర్థిక సంఘాలని అణచివేసిందని.. మోదీ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఐదవ పెద్ద అర్థిక వ్యవస్థగా అవతరించిందని.. 360 అర్టికల్ రద్దు, డిపేన్స్ అయుధాలు దిగుమతి స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి ఎదుగామని వివరించారు.
మే 13న తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాపాలను కడిగి ఖతం చేయాలని..కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ బీజేపి అభ్యర్థులను గెలిపించాలని మోదీ కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..