Telangana: తెలంగాణ లిక్కర్ మార్ట్ పేరుతో మద్యం దుకాణం.. కొనేందుకు ఎగబడుతున్న మందుబాబులు..
కొత్త ఏడాది అనగానే పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ సంబురాలు చేసుకోవడం.. అర్థరాత్రి 12 గంటలు దాటగానే టపాసులు కాల్చి సందండి చేసుకోవడం పరిపాటే. మరికొందరైతే పాత ఏడాది వెళ్లిపోతుందనే బాధలో కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలకాలనే సంబురంలో అంతే కొత్తగా వేడుకలు చేసుకునేందుకు సిద్దమవుతారు. అందులోను మద్యం ప్రియులైతే మరింత ఎక్కువగానే ప్లాన్ చేసుకుంటారు.
కొత్త ఏడాది అనగానే పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ సంబురాలు చేసుకోవడం.. అర్థరాత్రి 12 గంటలు దాటగానే టపాసులు కాల్చి సందండి చేసుకోవడం పరిపాటే. మరికొందరైతే పాత ఏడాది వెళ్లిపోతుందనే బాధలో కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలకాలనే సంబురంలో అంతే కొత్తగా వేడుకలు చేసుకునేందుకు సిద్దమవుతారు. అందులోను మద్యం ప్రియులైతే మరింత ఎక్కువగానే ప్లాన్ చేసుకుంటారు. అలాంటి మందు ప్రియులకు మేమున్నామంటూ స్వాగతం పలుకుతోంది అక్కడ కొత్తగా వెలిసిన లిక్కర్ మార్ట్. సింగరేణి ప్రాంతం కావడం రాష్ట్ర రాజధానికి ఏ మాత్రం తగ్గకుండా అన్ని బ్రాండ్ల మద్యం అక్కడ లభిస్తుండటంతో ఆ మార్ట్‌కు క్యూ కడుతున్నారు మద్యం ప్రియులు. నచ్చిన మద్యాన్ని కొనుగోలు చేస్తూ సంబురపడుతున్నారు. కొత్త ఏడాదికి సరికొత్త కిక్కుతో మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆ మత్తెక్కె కిక్కు ఎక్కడో తెలుసుకోవాలంటూ మంచి మంచిర్యాలకు వెళ్లి రావాల్సిందే.
సింగరేణి ఖిల్లా మంచిర్యాల జిల్లాలో సరికొత్తగా వెలిసిన తెలంగాణ లిక్కర్ మార్ట్ మద్యం ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 31.. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికే సంప్రదాయం పాటించే మందు బాబులంతా ఇప్పుడు ఈ లిక్కర్ మార్ట్‌కు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. సూపర్ మార్కెట్లో సరుకులు తీసుకున్నంత ఈజీగా నచ్చిన బ్రాండ్ మద్యాన్ని కొనుగోలు చేస్తూ సంబురపడిపోతున్నారు. మెట్రో సిటీలకు ఏమాత్రం తీసిపోని రేంజ్లో ఈ లిక్కర్ మార్ట్‌లో దేశ, విదేశీ మద్యం లభిస్తుండటంతో జివ్వ చాపల్యాన్ని చంపుకోలేని మద్యం ప్రియులు పెద్ద ఎత్తున ఈ మార్ట్‌కు క్యూ కడుతున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర్ థియోటర్ రోడ్లో వెలిసిన ఈ లిక్కర్ మార్ట్ మద్యం ప్రియులతో సందడిగా కనిపిస్తోంది. ఈ సరికొత్త లిక్కర్ మార్ట్‌లో ఇష్టమైన మద్యాన్ని కొనుగోలు చేస్తూ సందడి చేస్తున్నారు. డిసెంబర్ 31 కావడంతో న్యూ ఈయర్ సెలబ్రెషన్స్ కు సిద్దమైన మద్యం ప్రియులు సరసమైన ధరల్లో అందుబాటులోకి వచ్చిన విదేశీ బ్రాండ్ లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. మంచిర్యాలలో మొట్ట మొదటి సారిగా తెలంగాణ లిక్కర్ మార్ట్ పేరిట ఈ మద్యం మార్ట్ అందుబాటులోకి రావడంతో తెగ మురిసిపోతున్నారు. కొత్త ఏడాది సందర్బంగా కొనుగోళ్లు భారీగా పెరిగాయని లిక్కర్ మార్ట్ యాజమాన్యం సైతం హర్షం వ్యక్తం చేస్తోంది. ఏదేమైనా మద్యపానం ఎప్పటికి హానికరమే.. అతి ప్రమాదకరం కూడా మద్యం ప్రియులు తస్మాత్ జాగ్రత్త. పాత ఏడాదికి వీడ్కోలు చెప్పి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ సంబురాల్లో పాల్గొనడంలో తప్పులేదు. మద్యం తాగి రోడ్డు మీదకొచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తేనే అసలు ప్రమాదం. అతిగా మద్యం సేవించి వారి కోసం.. కొత్త ఏడాదే కాదు.. మీ కుటుంబ కూడా ఎల్లప్పుడు ఎదురు చూస్తూ ఉంటుందని గుర్తుంచుకోండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..