Komatireddy Venkat Reddy: ‘ఒకరు గర్జన.. ఒకరు ఉప్పెన’.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంత్రి కోమటిరెడ్డి పోస్ట్స్..
తెలంగాణలో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టి నెల పూర్తి కావొస్తోంది.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం.. కొలువుదీరిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. కేబినెట్ లో అనుభవం ఉన్న కీలక నాయకులకు అవకాశం ఇచ్చింది.. ఆ తర్వాత ఆరు గ్యారెంటీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టి నెల పూర్తి కావొస్తోంది.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం.. కొలువుదీరిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. కేబినెట్ లో అనుభవం ఉన్న కీలక నాయకులకు అవకాశం ఇచ్చింది.. ఆ తర్వాత ఆరు గ్యారెంటీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న వేళ.. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ట్వీట్స్ ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ కేబినెట్‌లో రోడ్లు, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతులు నిర్వర్తిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆదివారం ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్టులు చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామని అందులో పేర్కొన్నారు.
కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం…#KomatiReddyVenkatReddy #BhattiVikramarkaMallu #TelanganaPrajaPrabhutwam@Bhatti_Mallu @INCTelangana pic.twitter.com/suzRsjMIrA
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 30, 2023
ఇక రేవంత్ రెడ్డి, తాను ఉన్న ఫోటోలతో వీడియోను రూపొందించి పోస్ట్ చేశారు. దానికి సలార్ పాటను జోడించారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.
వేగమొకడు… త్యాగమొకడు గతము మరువని గమనమే.
ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే
ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన వెరసి ప్రళయాలే.
సైగ ఒకరు… సైన్యం ఒకరు కలిసి కదిలితే కదనమే…#AdminPost #KomatiReddyVenkatReddy #RevanthReddy #TelanganaPrajaPrabhutwam @revanth_anumula @INCTelangana pic.twitter.com/BPNdM4LuRZ
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 31, 2023
ఈ నెలలోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా.. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక కీలకమైన రోడ్లు, భవనాల శాఖతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇప్పుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సారథ్యంలో తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళతామని పలు సందర్భాల్లో చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా ట్వీట్స్ చేసి తామంతా ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు.
వీడియో చూడండి..
అయితే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..