TSRTC: ఇకపై ఆ టిక్కెట్లు ఇవ్వలేం.. ప్రయాణికులకు షాకిచ్చిన సజ్జనార్..
VC Sajjanar: ఈ క్రమంలో తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయం కేవలం హైదరాబాద్ రీజియన్ వరకే కావడం గమనార్హం. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ప్రయణికుల కోసం ఇంతకుముందు ఫ్యామిలీతోపాటు, టీ-6 టిక్కెట్లను అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ టిక్కెట్లను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు.
Telangana RTC: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి పథకం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో బస్సుల్లో సీటింగ్ ఆక్యూపెన్సీ విపరీతంగా పెరిగిందని సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అలాగే, కొంత ఇబ్బందులు వస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయం కేవలం హైదరాబాద్ రీజియన్ వరకే కావడం గమనార్హం. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ప్రయణికుల కోసం ఇంతకుముందు ఫ్యామిలీతోపాటు, టీ-6 టిక్కెట్లను అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ టిక్కెట్లను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు.
”ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది” అంటూ ట్వీట్‌లో తెలిపారు.
ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 31, 2023
అలాగే, “ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ట్వీట్‌లో ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..