KTR: ‘మెడికల్‌ కాలేజీలకు బదులు, యూట్యూబ్‌ ఛానల్స్‌ పెట్టాల్సింది’.. వైరల్‌ అవుతోన్న కేటీఆర్‌ ట్వీట్‌

ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం పెద్ద ఎత్తున జరిగింది. సీఎం రేవంత్‌తో పాటు ఇటు మాజీ మంత్రులు హరీష్‌ రావు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరిగింది. అధికార పార్టీ శ్వేత పత్రం పేరుతో, ప్రతిపక్ష పార్టీ స్వేద పత్రం పేరుతో పోటాపోటీగా ప్రకటనలు చేశాయి...

KTR: 'మెడికల్‌ కాలేజీలకు బదులు, యూట్యూబ్‌ ఛానల్స్‌ పెట్టాల్సింది'.. వైరల్‌ అవుతోన్న కేటీఆర్‌ ట్వీట్‌
KTR
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 31, 2023 | 12:20 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తతంగం ముగిసింది. అధికార మార్పిడి కూడా జరిగింది. బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు సైతం స్వీకరించారు. ఇప్పుడిప్పుడే కొత్త ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఇలా ఎన్నికలు ముగిశాయో లేదో అలా రాజకీయ వేడి అప్పుడే మొదలైంది.

ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం పెద్ద ఎత్తున జరిగింది. సీఎం రేవంత్‌తో పాటు ఇటు మాజీ మంత్రులు హరీష్‌ రావు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరిగింది. అధికార పార్టీ శ్వేత పత్రం పేరుతో, ప్రతిపక్ష పార్టీ స్వేద పత్రం పేరుతో పోటాపోటీగా ప్రకటనలు చేశాయి. ఇక సోషల్‌ మీడియా వేదికగానూ సెటైర్లు కొనసాగుతూనే ఉన్నాయి.

సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వారిలో మాజీ మంత్రి కేటీఆర్‌ ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు కేటీఆర్‌. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్‌ చేసిన ఓ ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి సంబంధించి ఓ సెటైరికల్‌ ట్వీట్ చేశారు కేటీఆర్‌.

కేటీఆర్‌ చేసిన ట్వీట్..

ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి గురించి ప్రస్తావిస్తూ.. ‘ఎన్నికల ఫలితాల తర్వాత నాకు చాలా చోట్ల నుంచి ఫీడ్‌ బ్యాక్‌, అబ్జర్వేషన్స్‌ వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్‌ ఇదే. కేసీఆర్‌ గారు తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి బదులుగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఫేక్‌ వార్తలను ప్రచారం చేసిన యూట్యూబ్‌ ఛానల్స్‌కు కౌంటర్‌గా 32 యూట్యూబ్‌ ఛానల్స్‌ను ఏర్పాటు చేయాల్సింది. ఈ విషయాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..