Telangana Intermediate Board: ఇంటర్ పరీక్ష ఫీజుల తేదీలు ఖరారు.. ఫీజు, చివరి తేదీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Telangana Intermediate Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజుల తేదీలను ఖరారు చేసింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్

Telangana Intermediate Board: ఇంటర్ పరీక్ష ఫీజుల తేదీలు ఖరారు.. ఫీజు, చివరి తేదీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Inter Board
Follow us
Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Updated on: Jan 05, 2022 | 4:30 PM

Telangana Intermediate Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజుల తేదీలను ఖరారు చేసింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలకు ఫీజుల చెల్లింపునకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఫైన్‌ తో ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు. ఇకపోతే, ఇటీవల పాస్ అయిన విద్యార్థులకు మార్కులు పెంచుకునే మరో అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఇటీవల పాస్ అయిన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే అవకాశం ఇచ్చింది.

ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి.. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ నెల 24 వరకు గడువు ఫైన్‌తో ఫిబ్రవరి 21 వరకు చెల్లించవచ్చు. లేట్ ఫీజు రూ. 100తో ఈనెల 25 నుంచి 31 వరకు చెల్లించవచ్చు. రూ.500 ఫైన్ తో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు చెల్లించవచ్చు. రూ.1000 ఫైన్ తో ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు చెల్లించవచ్చు. రూ.2 వేలతో ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు ఫీజు చెల్లించవచ్చు.

Also read:

Road Accident: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.. పేలుడు సంభవించి భారీగా మంటలు..!

China Landslides: చైనాలో విరిగిపడ్డ కొండచరియలు.. 14 మంది మృత్యువాత, మరో ముగ్గురు సీరియస్!

Medical College Raging: మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటనలో మరో ట్విస్ట్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలనాలు!