Road Accident: ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం.. పేలుడు సంభవించి భారీగా మంటలు..!
Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మితిమీరన వేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల ప్రతి..
Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మితిమీరన వేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించి భారీగా మంటలు చెలరేగాయి. రోడ్డుపైనే లారీ మంటల్లో తగలడడింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెంట్ దగ్గర తారామతిపేట దగ్గర చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరగడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఇవి కూడా చదవండి: