China Landslides: చైనాలో విరిగిపడ్డ కొండచరియలు.. 14 మంది మృత్యువాత, మరో ముగ్గురు సీరియస్!
China Landslide: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవన నిర్మాణ స్థలంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
China Landslide: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవన నిర్మాణ స్థలంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. గుయిజౌ ప్రావిన్స్‌లోని బిజీ నగరంలో సోమవారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అధికారులు.. ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని రిస్య్కూ బృందాలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి కండిషన్ స్థిరంగా ఉన్నట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే సహాయక చర్యల కోసం రాత్రికి రాత్రే వెయ్యి మందితో కూడిన ప్రత్యేక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. అక్కడ సహాయక చర్యలు పూర్తయ్యాయి. అయితే, సంఘటనకు సంబంధించిన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గుయిజౌ ప్రావిన్స్ అతి తక్కువ అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటి. అక్కడ పర్వతాలు, లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి.
2019లో కూడా గుయిజౌ ప్రావిన్స్‌లో ఇలాంటి ప్రమాదం జరిగింది. ఆ సయమంలో 16 మంది మృతి చెందారు. 30 మంది గల్లంతయ్యారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఆ ప్రమాదం జరిగింది. అప్పుడు 21 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌లోనూ చైనాలో కొండచరియలు విరిగి పడి న ఘటన చోటుచేసుకుంది. లాబాహే టౌన్‌లో జరిగింది. భారీ వర్షాల కారణంగా అప్పుడు కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, 14 మంది గల్లంతయ్యారు. కాగా, ప్రస్తుత ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
Read Also… TS Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో రచ్చ.. AICC మీటింగ్‌ను పట్టించుకోని PCC పెద్దలు!