Worlds oldest Woman: ప్రపంచ నెం.1 శతాధిక వృద్ధురాలు.. తాజాగా 119వ పుట్టిన రోజు జరుపుకున్న బామ్మ ..
Worlds oldest Woman: వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులతో మానవుల ఆయుః ప్రమాణం రోజురోజుకి తగ్గిపోతుంది. పైగా ఒత్తిడి, సరైన జీవన విధానాన్ని పాటించకపోవడంతో..
Worlds oldest Woman: వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులతో మానవుల ఆయుః ప్రమాణం రోజురోజుకి తగ్గిపోతుంది. పైగా ఒత్తిడి, సరైన జీవన విధానాన్ని పాటించకపోవడంతో రకరకాల వ్యాధుల బారినపడి అతి తక్కువ వయస్సులోనే మృత్యు ఒడికి చేరుకుంటున్నారు. అలాంటి పరిస్థితిని సైతం తట్టుకుని సెంచరీ వయసుదాటినా ఇప్పటికి ఆరోగ్యంగా ఉన్న ఒక బామ్మ తన 119వ పుట్టినరోజు జరుపుకుంది. జపాన్‌కు చెందిన తనకా 1903లో జన్మించింది. అంటే ఆమె మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి 11 సంవత్సారాల ముందు జన్మించింది. అంతేకాదు ప్రపంచంలేనే అత్యంత వృద్ధ మహిళ అయిన కేన తనకా తన 119వ పుట్టినరోజును జనవరి2, 2022న జరుపుకున్నారు.
అయితే ఈ బామ్మ మాట్లాడలేదు కానీ తన హావభావాలతో సిబ్బందిని కమ్యూనికేట్ చేస్తుంది. ఆమెకు ఐదుగురు పిల్లలు. ఆమె భర్త, పెద్ద కుమారుడు రెండవ చైనా-జపనీస్ యుద్ధంలో పాల్గోన్నారు. తనకా ఇప్పటికీ గణితం, నగీషీ వ్రాతలను ఎంతో ఉత్సాహంగా అధ్యయనం చేస్తుంటారు. ప్రస్తుతం ఓ నర్సింగ్ హోంలో నివసిస్తున్న ఆమె తన కుటుంబ సభ్యులు, నర్సింగ్ హోమ్ అటెండెంట్‌లతో బోర్డ్ గేమ్‌లు ఆడుతుండటం మరొక విశేషం. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2019లో తనకాని ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలిగా గుర్తించింది.
Also Read: