AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Covid cases: అమెరికాలో కరోనా థర్డ్ వేవ్ విలయతాండవం.. గత 24 గంటల్లో 1 మిలియన్ కంటే ఎక్కువ కేసులు..

అమెరికాలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది.  ఓమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తి చెందుతోంది. కేవలం సోమవారం ఒక్క రోజే 1 మిలియన్ COVID-19 కేసులు నమోదయ్యాయి.

US Covid cases: అమెరికాలో కరోనా థర్డ్ వేవ్ విలయతాండవం.. గత 24 గంటల్లో 1 మిలియన్ కంటే ఎక్కువ కేసులు..
Us Covid Cases
Sanjay Kasula
|

Updated on: Jan 04, 2022 | 11:42 AM

Share

అమెరికాలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. ఓమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తి చెందుతోంది. కేవలం సోమవారం ఒక్క రోజే 1 మిలియన్ COVID-19 కేసులు నమోదయ్యాయి. యుఎస్ ఆరోగ్య అధికారులు వెల్లడించింన సమాచారం ప్రకారం.. కరోనావైరస్ సెకెండ్ వేవ్‌ కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంగా థర్డ్ వేవ్‌లో కేసులను నమోదవుతున్నాయని పేర్కొంది. గత వారం రోజులకు ఈ వారంకు మధ్య గణనీయమైన పెరుగుదల కనిపించింది. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ విడుదల చేసిన తాజా నివేదికను విడుదల చేసింది. ఇందులో గత వారంలో ప్రతి 100 మంది అమెరికన్లలో 1 పాజిటివ్ కేసుగా నమోదవుతున్నట్లుగా తెలిపింది.

గత రెండు వారాలుగా అమెరికాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం సోమవారం US లో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారు. అంతకుముందు ఒక్కరోజులో 5,91,000 కరోనా కేసులు నమోదయ్యాయి. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ తాజా గణాంకాల ప్రకారం కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్ కారణంగా ప్రస్తుతం 1,03,000 మందికి పైగా ప్రజలు ఆసుపత్రిలో ఉన్నారు. గత నాలుగు నెలల్లో ఆసుపత్రులలో చేరిన వారి సంఖ్య ఇదే అత్యధికం.

గత వారం రోజుల వ్యవధిలో US ఆరోగ్య అధికారులు Omicron వేరియంట్ పెరుగుతున్న ప్రాబల్యం మధ్య ప్రతిరోజూ సగటున 3,20,000 కొత్త కేసులను నివేదించారు. ఈ విధంగా ఒక వారంలో 21 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

ఓమిక్రాన్ రూపాంతరం ఇలా..

నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో మొదటిసారి ఓమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. వేరియంట్ మరిన్ని ఉత్పరివర్తనాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. ఆఫ్రికాపై విధించిన ప్రయాణ ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఈ రూపాంతరం యూరప్, ఆసియా, అమెరికాతో సహా అనేక దేశాలలో పడగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందని  అయితే దాని లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ దీని తరువాత కూడా ప్రమాదం స్థిరంగా ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి: Curry Leaf: అమ్మో..! కరివేపాకు కిలో రూ. 175.. గ్రేటర్‌లో చుక్కలు చూపిస్తున్న ధర..

Viral Video: కుందేలపై మరోసారి గెలిచిన తాబేలు.. ఇది కథకాదు నిజం.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు..