AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry Leaf: అమ్మో..! కరివేపాకు కిలో రూ. 175.. గ్రేటర్‌లో చుక్కలు చూపిస్తున్న ధర..

తెలంగాణలో తీవ్రమైన చలి గాలులకు కరివేపాకు బక్కచిక్కింది. పంట సరిగా లేక మార్కెట్‌కు రావడం తగ్గింది..వచ్చిన కొద్ది ఆకు ధర ఆకాశాన్నంటుతోంది..కిలో 175 నుంచి 200 పలుకుతోంది..కొత్తిమీర, పుదీనా పంటుల బాగా పండడంతో..

Curry Leaf: అమ్మో..! కరివేపాకు కిలో రూ. 175.. గ్రేటర్‌లో చుక్కలు చూపిస్తున్న ధర..
Curry Leaf
Sanjay Kasula
|

Updated on: Jan 03, 2022 | 8:43 AM

Share

తెలంగాణలో తీవ్రమైన చలి గాలులకు కరివేపాకు బక్కచిక్కింది. పంట సరిగా లేక మార్కెట్‌కు రావడం తగ్గింది..వచ్చిన కొద్ది ఆకు ధర ఆకాశాన్నంటుతోంది..కిలో 175 నుంచి 200 పలుకుతోంది..కొత్తిమీర, పుదీనా పంటుల బాగా పండడంతో మార్కెట్‌కు పెద్దమొత్తంలో వస్తుండడంతో తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఎవరినైనా పట్టించుకోకపోతే.. నన్ను కూరలో కరివేపాకు లాగా తీసి పారేస్తున్నావ్ అంటూ సామేత వాడేస్తారు. అయితే.. ఇక ముందు అలా అనడానికి లేదండి బాబు. నేను కూడా ఉల్లి రేంజ్‌లో దూసుకుపోతానంటోంది. ఈ కరివేపాకు ధర ఇప్పుడు మండిపోతోంది.

కరివేపాకుకూ ఇప్పుడు డిమాండ్‌ ఉన్నా లేకున్నా.. దిగుబడి మాత్రం తగ్గింది.. కొరత ఏర్పడడంతో నగరంలో కరివేపాకు ధరలకు రెక్కలొచ్చాయి. మునుపెన్నడూ లేనివిధంగా హోల్‌సేల్‌ మార్కెట్‌లో కేజీ రూ.175 నుంచి రూ. 200 వరకు పలుకుతోంది. ఇక రిటైల్‌ మార్కెట్‌లో ఒక కట్ట ఎంత ఉంటుందో ఊహించుకోండి.

భారతీయుల వంటకాల్లో పూర్వకాలం నుంచి కరివేపాకుకు విశిష్ట స్థానం ఉంది. మనం వండుకునే ఆహారపదార్ధాలకు మంచి రుచిని, సువాసన ను ఇవ్వడంలో కరివేపాకుకి ప్రత్యేక స్థానం ఉంది. కూరల్లో తాలింపుగా ఉపయోగించే ఈ కరివేపాకులో ఎన్నోఔషధాలున్నాయి. ప్రస్తుతం కరివేపాకుకు సీజన్‌ కాకపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్‌కు తగిన సరఫరా లేక ధరలు పెరిగాయి.

గ్రేటర్‌ పరిధిలోని హోల్‌సేల్, రిటైల్, రైతుబజార్లకు రోజు దాదాపు 10 టన్నుల వరకు దిగుమతి అవుతుంది. కరివేపాకులో లభించే ల్యూటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా కాపాడుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనిలో ఫోలిక్‌ యాసిడ్, నియాసిన్, బీటా కెరటిన్, ఇనుము, కాల్షియం, పాస్ఫరస్, పీచు, మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి.

జీర్ణక్రియను మెరుగుదల పరిచి అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుందని గ్రేటర్‌ జనం కరివేపాకును ఎక్కువగా వినియోగిస్తున్నారు. కూరల్లో వాడడమే కాకుండా కరివేపాకు పొడిని ప్రత్యేకంగా తయారు చేసి కూడా అన్నంతోపాటు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: వారికి ఉద్యోగాలు ఇవ్వలేం.. మా వద్ద అలాంటి పాలసీ లేదు: దివ్యాంగ మహిళా ప్లేయర్‌కు షాకిచ్చిన పంజాబ్

AR Rahman: వేడుకగా ఏ ఆర్‌ రెహమాన్‌ కూతురి నిశ్చితార్థం.. కాబోయే వరుడు ఎవరంటే..