Hyd – Theater Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన సినిమా థియేటర్..
Hyd - Theater Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో థియేటర్ మొత్తం కాలిబూడిదయంది. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ సమీపంలో
Hyd – Theater Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో థియేటర్ మొత్తం కాలిబూడిదయంది. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ సమీపంలో ఉన్న శివ పార్వతి థియేటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో థియేటర్ కాలి బూదదైంది. షార్ట్‌స్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. క్షణాల్లోనే థియేటర్ మొత్తం మంటలు వ్యాపించడంతో.. అందులోని ఫర్నీచర్ అంతా దగ్ధం అయ్యింది. శివ పార్వతి థియేటర్‌లో శ్యామ్ సింగరాయ్ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఆదివారం సెకండ్ షో పూర్తయిన తరువాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినిమా థియేటర్ పూర్తిగా అగ్నికి ఆహుతి అవ్వటంతో సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని, ప్రమాదానికి గల కారణాల పై దర్యాప్తు చేస్తున్నామని కె.పి.హెచ్.బి సిఐ తెలిపారు.
Also read: