Rythu bandhu: నేటి నుంచి రాష్ట్రంలో రైతుబంధు సంబురాలు.. గ్రామాల్లో పండుగ వాతావరణం..
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి వారం రోజులపాటు రైతుబంధు సంబురాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 10 తేదీ వరకు రైతుబంధు సంబురాలు కొనసాగనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి వారం రోజులపాటు రైతుబంధు సంబురాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 10 తేదీ వరకు రైతుబంధు సంబురాలు కొనసాగనున్నాయి. రైతు బంధు సంబరాల్లో భాగంగా ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపులతో మొదలు పెట్టి… రైతు వేదికల వద్ద పండుగ వాతావరణంలో ముంగింపు సంబరాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. సంబరాలను మీడియాలో.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేపట్టాలని వెల్లడించారు. రైతు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందిస్తామన్నారు.
సాగు వైపు కొత్త తరాన్ని మళ్లించేందుకు ఆలోచించే ప్రతి ప్రభుత్వం రైతుబంధు లాంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుందన్నారు. అలాంటి ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వ రైతుబంధు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విధించిన పరిమితులను గుర్తుంచుకొని రైతుబంధు సంబరాలు నిర్వహించాలన్నారు. శాసనసభ్యులు ఈ సంబురాల విషయంలో ముందుండి నియోజకవర్గ పార్టీశ్రేణులను కలుపుకొని ముందుకు పోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోందన్నారు.
Read Also.. Bandi Sanjay: బండి సంజయ్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. కరీంనగర్లో ఉద్రిక్తత..