Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: బండి సంజయ్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. కరీంనగర్‎లో ఉద్రిక్తత..

ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తలపెట్టిన జన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 

Bandi Sanjay: బండి సంజయ్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. కరీంనగర్‎లో ఉద్రిక్తత..
Bandi Sanjay
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 02, 2022 | 10:54 PM

ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తలపెట్టిన జన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు, వాహనంలో స్టేషన్‎కు తరలించారు. భాజపా కార్యాలయ తాళాలు పగలగొట్టిన పోలీసులు సంజయ్‎ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు దీక్షను అడ్డుకోవడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. నల్గొండలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు అనుమతించిన పోలీసులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 317జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందని, సొంత జిల్లాలో కూడా పరాయి వాడిగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పారు. జీవోను సవరించి, అందుకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.