Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccination:15 నుంచి 18 ఏళ్లలోపు వారికి నేటి నుంచి వ్యాక్సినేషన్.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న 4.5 లక్షల మంది..

దేశంలో నేటి నుంచి పిల్లలకు (15 నుంచి 18 ఏళ్లలోపు) కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. దీని కోసం జనవరి 1వ తేదీ శనివారం ఉదయం నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారు.

Vaccination:15 నుంచి 18 ఏళ్లలోపు వారికి నేటి నుంచి వ్యాక్సినేషన్.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న 4.5 లక్షల మంది..
Vaccine
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 03, 2022 | 5:44 AM

దేశంలో నేటి నుంచి పిల్లలకు (15 నుంచి 18 ఏళ్లలోపు) కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. దీని కోసం జనవరి 1వ తేదీ శనివారం ఉదయం నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారు. కొవిన్ వెబ్‌సైట్‌లో 15 ఏళ్ల నుంచి 18ఏళ్లలోపు వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలు పెట్టిన 36 గంటల్లోనే భారీ సంఖ్యలో టీనేజన్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జనవరి 2వ తేదీ మధ్యాహ్నం వరకూ 4.5 లక్షల మందికి పైగా యువతీ యువకులు వ్యాక్సిన్ కోసం విన్ పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కాగా, ఇప్పటి వరకు 145.52 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందులో మొదటి డోసు 84.73 కోట్లు, రెండో డోసు 60.79 కోట్లు ఉన్నట్లు తెలిపింది. అయితే ఆదివారం మధ్యాహ్నం వరకు అన్ని ఏజ్ గ్రూప్‌లలో వాళ్లు కలిపి 92.23 కోట్ల మంది కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, ఇందులో 18 నుంచి 44 ఏండ్ల మధ్య వాళ్లు 57.39 కోట్ల మంది, 45 ఏండ్ల పైబడిన వాళ్లు 34.78 కోట్ల మంది ఉన్నారని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం పిల్లలకు కొవాగ్జిన్ టీకా మాత్రమే వేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే మరికొద్ది రోజుల్లో మరో రెండు వ్యాక్సిన్లు పిల్లలకు వేసేందుకు అందుబాటులోకి రానున్నాయి.

కేంద్రం అందించిన మార్గదర్శకాల ప్రకారం 15 నుంచి 18 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలకు మాత్రమే కోవాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని కోవిన్ ప్లాట్‌ఫాం చీఫ్ డా.ఆర్.ఎస్.శర్మ తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం 10వ తరగతి ఐడీ కార్డు కూడా గుర్తింపు కోసం పరిగణిస్తామని డాక్టర్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. ఎందుకంటే కొంతమంది విద్యార్థులకు ఆధార్ కార్డు లేదా మరే ఇతర గుర్తింపు కార్డు ఉండకపోవచ్చనే దానిపై ఇలాంటి మార్పు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

టీకా నమోదు ప్రక్రియ..

1. ముందుగా కోవిన్ యాప్‌కి వెళ్లాలి. మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఓటీపీని నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వొచ్చు. 2. ఇప్పుడు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, పెన్షన్ పాస్‌బుక్, ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డ్, ఓటర్ ఐడీ, యునిక్ డిసేబిలిటీ ఐడి లేదా రేషన్ కార్డ్ నుంచి ఏదైనా ఒక ఫోటో ఐడీ ప్రూఫ్‌ని ఎంచుకోవాలి. 3. మీరు ఎంచుకున్న ఐడీ నంబర్, పేరు నమోదు చేయండి. అప్పుడు లింగం, పుట్టిన తేదీని ఎంచుకోవాలి. 4. సభ్యుడిని జోడించిన తర్వాత, మీరు మీ సమీప ప్రాంతం పిన్ కోడ్‌ను నమోదు చేయాలి. అప్పుడే టీకా వేసే కేంద్రాల జాబితా వస్తుంది. 5. ఇప్పుడు టీకా తేదీ, సమయం, టీకాను ఎంచుకోవాలి. కేంద్రానికి వెళ్లి టీకాలు వేయించుకోవాలి. 6. టీకా కేంద్రంలో, మీరు రిఫరెన్స్ ఐడీ, రహస్య కోడ్‌ను అందించాలి. అలాగే మీ లాగిన్‌కి ఇతర సభ్యులను జోడించడం ద్వారా మీ టీకాలను నమోదు చేసుకోవచ్చు. 7. కోవాక్సిన్ 12 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించారు. అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 8. డ్రగ్స్ కంట్రోలర్ 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అత్యవసర ఉపయోగం కోసం భారత్ బయోటెక్ కోవాక్సిన్‌ను ఆమోదించినప్పటికీ, ప్రభుత్వం 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మాత్రమే టీకాలు వేయడం ప్రారంభించాలని నిర్ణయించింది.

Read Also.. Bandi Sanjay: బండి సంజయ్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. కరీంనగర్‎లో ఉద్రిక్తత..