Telangana: మోదీ ప్రభుత్వానికి మేకిన్ ఇండియా కాదు, సేల్ ఇన్ ఇండియా పాలసీ.. వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..
Telangana: ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు.
Telangana: ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. మోదీ ప్రభుత్వానిది మేకిన్ ఇండియా కాదని, సేల్ ఇన్ ఇండియా పాలసీ అని దుయ్యబట్టారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. సేవ్ పీఎస్‌యూ – సేవ్ ఇండియా పేరుతో ప్రజల్లోకి వెళతామని ప్రకటించారు. ఈ సమావేశం నుంచే కేంద్ర ప్రభుత్వంపై సమర శంఖారావాన్ని పూరిస్తున్నామని అన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ.. వాటిని ప్రైవేటు పరం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు వినోద్ కుమార్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ చేయడం అంటే రిజర్వేషన్లు తీసివేయడమేనని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, వర్గాలకు ఉద్యోగాలు దక్కకుండా మోడీ ప్రభుత్వం మోసపూరితంగా పావులు కదుపుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడంతో బిసి, ఎస్సి, ఎస్టీ లకు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోయే పరిస్థితులు రానుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 1.50 లక్షల మంది పని చేస్తున్నారని చెప్పారు. రక్షణ శాఖను సైతం ప్రైవేట్ కు అమ్మేందుకు ప్లాన్ చేస్తోంది ఈ కేంద్ర ప్రభుత్వం అంటూ వినోద్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. మిధాని, బిడిఎల్, ఆర్డినెన్స్ సంస్థ లను కూడా అమ్ముతున్నారని విమర్శించారు. అబ్దుల్ కలాం ఇక్కడ అనేక పరిశోధనలు చేశారని పేర్కొన్నారు. ఎల్ఐసి ని కూడా అమ్ముతున్నారని, దీంతో పేదలకు భీమా సౌకర్యం మరింత ప్రీమియం కానుందని చెప్పారు.
Also read:
Omicron: హోమ్ టెస్ట్ ద్వారా ఒమిక్రాన్‌ని గుర్తించవచ్చా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
Tea: చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా.. దీని వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది.. అదేంటో తెలుసా..