AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bandhu: రేపటి నుంచి పది రోజుల పాటు రైతుబంధు సంబురాలు.. గులాబీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు..

తెలంగాణలో సోమవారం నుంచి పది రోజుల పాటు రైతుబంధు సంబురాలు నిర్వహించుకోవానలి తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌..

Rythu Bandhu: రేపటి నుంచి పది రోజుల పాటు రైతుబంధు సంబురాలు.. గులాబీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు..
Telangana Minister KTR
Sanjay Kasula
|

Updated on: Jan 02, 2022 | 9:07 PM

Share

Minister KTR – Rythu Bandhu: తెలంగాణలో సోమవారం నుంచి పది రోజుల పాటు రైతుబంధు సంబురాలు నిర్వహించుకోవానలి తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు. రైతుల ఖాతాల్లో రూ.50వేలకోట్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించనున్న నేపథ్యంలో ఆదివారం కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌  ద్వారా ఈ విరాలను వెల్లడించారు. టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, రైతుబంధు అధ్యక్షులు, డీసీఎంఎస్‌ చైర్మన్లతో జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌ రైతుబంధు సంబురాలుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏనాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చరిత్రలో ఎన్నడూ చరిత్రలో ఎన్నడూ ఆలోచించని స్థాయిలో.. తెలంగాణ రైతుల గురించి సీఎం కేసీఆర్ ఆలోచించారని అన్నారు. ఇందులో భాగంగా   గొప్ప కార్యక్రమం రైతుబంధు అని వెల్లడివంచారు. ఈ పథకం ప్రారంభమైనాటి నుంచి ఈ నెల 10 నాటికి రూ.50వేలకోట్లు రైతుల ఖాతాల్లోకి జమకాబోతున్నాయన్నారు. రైతుబంధు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి రైతాంగం ఎనలేని సంతోషంతో ఉందని అన్నారు మంత్రి కేటీఆర్‌. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఓ గొప్ప ఊతరంగా మారిందన్నారు. ఇలా రూ.50వేలకోట్లు రైతుల ఖాతాల్లోకి చేరిన సందర్భంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేదని.. ఇది అద్భుతమైన సందర్భం అన్నారు. ఇలాంటి చారిత్రక సందర్భాన్ని అంతా సెలబ్రేట్‌ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశ చరిత్రలో ఏ సీఎం, పీఎం చేయలేనంత గొప్ప కార్యక్రమాలను వ్యవసాయ రంగం కోసం రైతన్నల కోసం కేసీఆర్ చేశారన్నారు.

సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రైతుబంధు ఉత్సవాలను నిర్వహించాలని శ్రేణులకు కేటీఆర్‌ సూచించారు. తాజాగా ప్రభుత్వం కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో విధించిన పరిమితులను గుర్తించుకొని సంబురాలు నిర్వహించాలని, ఎమ్మెల్యేలు ఈ విషయంలో ముందుండి నియోజకవర్గ పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు.

ఇవి కూడా చదవండి: Early Election: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రచ్చ.. ముందస్తు ప్రచారంపై అధికార పక్షాల ఫైర్..

Viral Video: వామ్మో..! ఇది మైకేల్ జాక్సన్‌ను మించిపోయిందే.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న పావురం డ్యాన్స్..