AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Early Election: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రచ్చ.. ముందస్తు ప్రచారంపై అధికార పక్షాల ఫైర్..

తెలుగురాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? అలాంటి సిట్యువేషన్‌ ఉంటే.. అధికార పార్టీ నేతల నుంచి అలాంటి సంకేతాలు రావాలి. కానీ విచిత్రంగా ప్రతిపక్ష నేతల నోటి వెంట ముందస్తు ముచ్చట వినిపిస్తోంది. ఎందుకిలా..

Early Election: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రచ్చ.. ముందస్తు ప్రచారంపై అధికార పక్షాల ఫైర్..
Andhra Pradesh Telangana Pa
Sanjay Kasula
|

Updated on: Jan 02, 2022 | 5:31 PM

Share

తెలుగురాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? అలాంటి సిట్యువేషన్‌ ఉంటే.. అధికార పార్టీ నేతల నుంచి అలాంటి సంకేతాలు రావాలి. కానీ విచిత్రంగా ప్రతిపక్ష నేతల నోటి వెంట ముందస్తు ముచ్చట వినిపిస్తోంది. ఎందుకిలా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. అయితే పొత్తులపై మాత్రం నో కామెంట్ అంటూ దాటవేశారు.

చంద్రబాబు ముందస్తు మాటకి వైసీపీ కౌంటర్‌ ఇచ్చింది. అంత సిన్మానే లేదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఇక అంతకుముందు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గత ఎన్నికల్లో ఎలాగైతే సీఎం కేసీఆర్‌ ముందస్తుకి వెళ్లారో ఈ సారి అదే రిపీట్ అవుతుందని పార్టీ నేతలకు సూచించారు.

ముందస్తు ఎన్నికలపై బీజేపీ మంత్రి జగదీష్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజల్ని డైవర్ట్‌ చేసేందుకు ఎన్నికల స్టంట్‌ ఎత్తుకున్నారని విమర్శించారాయన. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ముందస్తు సిగ్నల్స్ ఇస్తుంటాయి. కానీ ఈసారి ప్రతిపక్ష పార్టీలే ముందస్తు నెత్తినేసుకుంటున్నాయి. మరి నిజంగానే వాళ్ల మాటలు నిజమవుతాయా అన్న చర్చ తెలుగురాష్ట్రాల్లో నడుస్తోంది.

ఇవి కూడా చదవండి: KTR: ఆదిలాబాద్‌లో సీసీఐను పున:ప్రారంభించండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

Mega Star Chiranjeevi: ‘అలాంటి పంచాయితీలు నేను చేయలేను’.. చిరు సంచలన వ్యాఖ్యలు