AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Raja Singh: ఏపీ సర్కార్‌పై ఎమ్మెల్యే రాజసింగ్ సంచలన కామెంట్స్.. ఏ విషయంలో ఫైర్ అయ్యారంటే..

MLA Raja Singh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ఆలయాన్ని, ఆలయ మర్యాదను కాపాడటంతో

MLA Raja Singh: ఏపీ సర్కార్‌పై ఎమ్మెల్యే రాజసింగ్ సంచలన కామెంట్స్.. ఏ విషయంలో ఫైర్ అయ్యారంటే..
BJP MLA Raja singh
Shiva Prajapati
|

Updated on: Jan 02, 2022 | 7:07 PM

Share

MLA Raja Singh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ఆలయాన్ని, ఆలయ మర్యాదను కాపాడటంతో ఏపీ సీఎం జగన్, దేవాదాయ శాఖ విఫలమైందని విమర్శించారు. ఆదివారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అన్యమతస్థులు ఉండకూడదు అని 426 జీఓ అమలులో ఉండేదని గుర్తు చేశారు. కానీ, జగన్ ప్రభుత్వంలో మాత్రం అంతా రివర్స్ జరుగుతోందన్నారు. అన్యమతస్థులు ఉండకూడదు అని హిందులవులు హైకోర్టు వెళ్తే.. తాము ఇక్కడే వ్యాపారాలు చేస్తామని అన్యమతస్థులు సుప్రీంకోర్టు వెళ్లారని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదా? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ లాయర్ ని ఎందుకు నియమించలేదని నిలదీశారు. ఏపీలో హిందులకు గాని, హిందూ దేవాలయాలకు గానీ రక్షణ లేదన్నారు. ఒకరి మత ప్రార్థనా స్థలాలకు మరొకరు రాకుండా పద్ధతులు పాటించాలన్న ఆయన.. మత ఘర్షణలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరిగే తాజా పరిణామాలకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలన్నారు రాజాసింగ్.

Also read:

Super Foods: చలికాలంలో ఇమ్యూనిటీ పెరగడానికి 10 సూపర్ ఫుడ్స్‌.. అవేంటంటే..?

Pressure Cooked Rice: ప్రెషర్‌ కుక్కర్‌లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..? ఆరోగ్య నిపుణుల క్లారిటీ..!

Vastu Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులున్నాయా.. ఈ వాస్తు నియమాలు పాటిస్తే డబ్బుకు లోటు ఉండదు