Vastu Tips: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులున్నాయా.. ఈ వాస్తు నియమాలు పాటిస్తే డబ్బుకు లోటు ఉండదు
Vastu Tips: మనిషి తాను కన్న కలలను నెరవేర్చుకోవడానికి పగలు, రాత్రి కష్టపడి డబ్బు సంపాదిస్తారు. అయితే చాలాసార్లు కష్టానికి తగిన ఫలితం దక్కదు. అంతేకాదు.. కొన్నిసార్లు డబ్బు అనవసరంగా..
Vastu Tips: మనిషి తాను కన్న కలలను నెరవేర్చుకోవడానికి పగలు, రాత్రి కష్టపడి డబ్బు సంపాదిస్తారు. అయితే చాలాసార్లు కష్టానికి తగిన ఫలితం దక్కదు. అంతేకాదు.. కొన్నిసార్లు డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుంది. ఇంట్లో వాస్తు దోషం ఉంటే కుటుంబ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, డబ్బు నిల్వ ఉండదని వాస్తు శాస్త్రం పేర్కొంది. అయితే ఇంట్లోని వాస్తుకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని వాటిని సవరించుకోవడం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు , పురోగతిని సాధించవచ్చు. ఈ వాస్తు నియమాలను పాటిస్తే.. మీ ఇల్లు సిరి సంపదతో తులతూగుతుంది.
*వాస్తు శాస్త్రం ప్రకారం.. తులసి మొక్కను ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలి. ఇలా చేయడం వల్ల మానసిక, శారీరక, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
*జీవితంలో పురోగతి సాధించాలంటే ఇంట్లో ఈశాన్య మూల ఎప్పుడూ ఖాళీగా శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాదు ఈశాన్య మూల తెలుపు రంగు స్ఫటికాలను ఉంచండి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. సంపద తో పాటు ఆర్ధిక పురోగతికి మార్గం తెరుస్తుంది.
* వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని కుళాయిల నుంచి లేదా ట్యాంకుల నుండి నీరు వృధాగా ప్రవహించడం శుభపరిణామంగా పరిగణించబడదు. ఇలా ఇంట్లో నీరు వృథాగా పొతే.. డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి. కనుక నీరు వృథా కాకుండా చూసుకోవాలి.
*బృహస్పతి ఆనందం, శ్రేయస్సు నిచ్చే గ్రహంగా వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే బృహస్పతి బలహీనంగా ఉంటె జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. బృహస్పతి అనుకూలంగా ఉండటానికి.. ఇంటిని శుభ్రం ఉంచుకోవాలి. అంతేకాదు.. నీటిలో పసుపు కలిపి.. ఆ నీటిని ఇంటిలో శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయడం వలన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
*వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటిలో ఈశాన్యం లేదా తూర్పు దిశలో కూర్చొని ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు.
*మీ పనికి ఆటంకం ఏర్పడి, పురోగతి లేకుంటే, ఇంటిలో ఉన్న ముళ్ళ మొక్కలను తొలగించండి. మీ ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగి సంపదను పొందుతారు.
*ఇంటి తలుపులను, కిటికీలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. ఎందుకంటే ఇంటికి వచ్చే డబ్బుకి తలుపులకు సంబంధం కలిగి ఉంటుంది. డబ్బు సంపాదించే మార్గంలో అడ్డంకి ఏర్పడుతుంది.
*ఇంట్లో పూజా స్థలం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి దక్షిణంవైపు దేవుడి పూజ చేసుకునే గది ఉంటే.. డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఇంట్లో ఈశాన్య మూలో ఎల్లప్పుడూ పూజ చేసే విధంగా ఉండాలి.
*ఇంటి ఉత్తర దిక్కు కుబేరుని దిక్కుగా పరిగణించబడుతుంది. కనుక అల్మారా తలుపు ఉత్తరం వైపు తెరిచే ఏర్పాటు చేసుకోవాలి. అది సంపదను పెంచుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం లక్కీ ప్లాంట్ సానుకూల శక్తిని పెంచుతుంది. ఈ మొక్కను ఇంట్లో ఉంచుకోవోడం వలన సంపద పెరుగుతుందని నమ్ముతారు. మీ ఇంట్లో డబ్బు ఇబ్బందులు తరచుగా కలుగుతుంటే.. లక్కీ ప్లాంట్ ను పెంచుకోమని సూచిస్తున్నారు.
Also Read: పంచాయతీ నావల్ల కాదన్న చిరు.. అన్న వ్యాఖ్యలపై తమ్ముడి రియాక్షన్ కోసం సర్వత్రా ఆసక్తి..