Chiru-Pawan: పంచాయతీ నావల్ల కాదన్న చిరు.. అన్న వ్యాఖ్యలపై తమ్ముడి రియాక్షన్ కోసం సర్వత్రా ఆసక్తి..
Chiru-Pawan: 'ఇండస్ట్రీకి పెద్ద! అనేది నాకో పెద్ద ఇబ్బంది' 'ఇద్దరి మధ్య పంచా యితీలు నావల్ల కావు' అంటూ చిరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది...
Chiru-Pawan: ‘ఇండస్ట్రీకి పెద్ద! అనేది నాకో పెద్ద ఇబ్బంది’ ‘ఇద్దరి మధ్య పంచా యితీలు నావల్ల కావు’ అంటూ చిరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో జరిగే పరిగే పరిణామాలకు.. చిరు మదిలో మెదిలే ఆలోచనలకు ఈ స్టేట్మెంట్ అద్దం పడుతోంది. ఓ రంకంగా చెప్పలంటే విసిగి..వేసారిపోయాను.. నేను ఏమీ చేయలేననే నిస్సహాత ఆయన మాట్లలో వినిపిస్తోంది. ఆయన చర్యల్లో కనిపిస్తోంది. అయితే కావాల్సినప్పుడు మాత్రం కార్మికులకు అండగా నిలబడతాను.. అవసరమైనప్పుడు ఆదుకుంటాను అనే మాటలు మరో సారి చిరు హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాయి. చిరు మాతోనే ఉంటారన్న నమ్మకాన్ని సినీ కార్మికుల్లో కలిగిస్తున్నాయి.
అయితే చిరు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడం కంటే.. ఈ వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారనే ఈగర్ మాత్రం అందరిలో నెలకొంది. చిరుకు అండగా… నీడగా.. తోడుగా ఉండే పవన్… తన ప్రియతమ అన్న మాటలతో ఏకీభవిస్తారా..? మద్దతుగా మాట్లాడి తన అన్నను వెనుకేసుకొస్తారా..? లేదా.. ఆవేశంతో ఊగిపోతూ.. అన్నలో అశాంతి రగిలించిన ఇండస్ట్రీ పరిస్థితులపై విరుచుకుపడతా..? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అందరితో లెట్స్ వెయిట్ అండ్ సీ అనేలా చేస్తున్నాయి.
Also Read: భూమి నగరాలు, వనరులపై ఏలియన్స్ దాడి..? వివిధ రూపాల్లో రెక్కీలు నిర్వహిస్తున్నారంటున్న ప్రొఫెసర్..