AP Theaters Tickets: ఆ ఇద్దరు హీరోలను తొక్కేయడానికే ఇదంతా చేస్తున్నారా? వారికి 10కోట్లు తగ్గితే పోయేదేమీ లేదన్న ఆర్జీవీ

AP Theaters Tickets: ఆంధ్రప్రదేశ్ లోని మూవీ టికెట్స్ ధరపై సీఎం జగన్ సర్కార్ పట్టిన పట్టు విడవను.. ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్స్ టికెట్స్ ధరలు పెంచేది లేదంటూ.. పట్టుబట్టుకుని కూర్చుంది...

AP Theaters Tickets: ఆ ఇద్దరు హీరోలను తొక్కేయడానికే ఇదంతా చేస్తున్నారా? వారికి 10కోట్లు తగ్గితే పోయేదేమీ లేదన్న ఆర్జీవీ
Ram Gopal Varma
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2022 | 5:45 PM

AP Theaters Tickets: ఆంధ్రప్రదేశ్ లోని మూవీ టికెట్స్ ధరపై సీఎం జగన్ సర్కార్ పట్టిన పట్టు విడవను.. ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్స్ టికెట్స్ ధరలు పెంచేది లేదంటూ.. పట్టుబట్టుకుని కూర్చుంది. ఇదే విషయంపై ఇప్పటికే ఒకసారి స్పందించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా మరోసారి తనదైన శైలిలో స్పందించారు.

ఆర్జీవీ అంటేనే ఓ సంచలననం.. ఓ వివాదం.. అతను మాట్లాడినా .. మాట్లాడకపోయినా కూడా సంచలనమే.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని సినిమా టికెట్ల తగ్గింపు వివాదంపై మరోసారి  రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ఎవరికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది.. ఏమి చెయ్యగలం.. ఏమి చేయలేము అనేది ఒక లిమిట్ ఉంటుందని అన్నారు. అంతేకాదు ఏపీ సర్కార్ ను ఏకంగా కరోనా వైరస్ తో పోల్చుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ గవర్నమెంట్ కోవిడ్ వంటిది.. కోవిడ్ ను మనం ఏమి చెయ్యలేం.. అలాగే ఏపీ ప్రభుతాన్ని కూడా ఏమీ చెయ్యలేం.. సో కరోనాని భరిస్తున్నట్లే.. ఏపీ ప్రభుత్వాన్ని కూడా భరించాలని ఆర్జీవీ సంచలన కామెంట్స్ చేశారు.

అంతేకాదు సినిమా మేకింగ్‌లో 70శాతం హీరోలకు రెమ్యునరేషన్‌ పోతుందన్న మంత్రులు పేర్నినాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలను ఆర్‌జీవీ తప్పుపట్టారు. నిర్మాణం ఖర్చులలోనే హీరోల రెమ్యునరేషన్‌ ఉంటుందని చెప్పారు. ఎవరూ తాము నష్టపోవాలని భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయరని అన్నారు. హీరోకు భారీగా డబ్బు ఇచ్చేది అతని ముఖం చూసి మూవీకి ప్రేక్షకులు వస్తారని చెప్పారు రామ్ గోపాల్ వర్మ..

రేకుల షెడ్డుకు మల్టీప్లెక్స్‌లకు ఒకటే టికెట్‌ అంటే ఏలా.. అంటూ ప్రభుత్వ తీరుని ఎద్దేవా చేశారు వర్మ. ఏపీ ప్రభుత్వం ఇద్దరు హీరోలను తొక్కేయడానికి చేస్తున్నారా? లేదా అనేది తనకు తెలియదని చెప్పారు. అంతేకాదు అసలు వారి రెమ్యునరేషన్ లో RS 10కోట్లు తగ్గితే ఆ ఇద్దరు సంపన్న హీరోలకు పోయేది ఏమిలేదన్నారు.. కానీ ఇద్దరు హీరోల కోసం తీసుకుంటున్న నిర్ణయాలతో చిన్న హీరోలు దెబ్బతింటారని ఆందోళన వ్యక్తం చేశారు ఆర్జీవీ.

అంతేకాదు అసలు ఏపీ ప్రభుతం తీసుకున్న ఈ సినిమ టికెట్ల ధరలు తగ్గింపు వెనుక ఏమైనా కారణం ఉంటే క్లియర్‌ కట్‌గా చెప్పండని డిమాండ్ చేశారు.  సినిమా టికెట్ ధరను నియంత్రించినట్లు ఫైవ్‌స్టార్‌ హోటల్ పుడ్‌ ధరలను కూడా నియంత్రిస్తారా? బ్రాండెడ్‌ షర్ట్స్‌ల ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి.? తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వం తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు రామ్ గోపాల్ వర్మ.. మరి వర్మ చేసిన కామెంట్స్ కు ఆరోపణలు ఏపీ మంత్రులు, నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి..

Also Read:

 బాలీవుడ్‌లో సత్తా చాటుతూ.. 83 మూవీని బీట్ చేసే దిశగా పుష్ప మూవీ.. మూడు వారాల్లో రూ. 56 కోట్లు వసూలు

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా