Alluri Seetharamaraju Jayanthi: అల్లూరి ఘనత యావత్ భారతావనికి తెలయాలి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక కామెంట్స్..

Alluri Seetharamaraju Jayanthi: అల్లూరి ఘనత యావత్ భారతావనికి తెలయాలి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక కామెంట్స్..

Alluri Seetharamaraju Jayanthi: క్షత్రీయ సేవా సమితి ద్వారా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్‌ ఎఫ్ఎన్‌సిసిలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సంబరాల ఆవిష్కరణ మహోత్సవాన్ని

Shiva Prajapati

|

Jan 02, 2022 | 6:04 PM

Alluri Seetharamaraju Jayanthi: క్షత్రీయ సేవా సమితి ద్వారా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్‌ ఎఫ్ఎన్‌సిసిలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సంబరాల ఆవిష్కరణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అల్లూరి సీతారామరాజు లాంటి ‘unsung heroes’ వీరోచిత గాథలను భావితరాలకు పరిచయం చేసేందుకు రూ. 38 కోట్లతో ఒక మ్యూజియం కడుతున్నాం అని ప్రకటించారు. అంతేకాదు.. హైదరాబాద్‌లో కూడా 18 కోట్లతో ఒక మ్యూజియం కట్టబోతున్నాం అని కిషన్ రెడ్డి చెప్పారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ‘‘indian unsung heroes & freedom fighters’’ గురించి అందరికీ తెలపాలని నరేంద్రమోడీ కృష్జి చేస్తున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జార్ఖండ్‌లో పుట్టిన బిర్స ముండ 22 సంవత్సరాల వయస్సులో గిరిజనుల హక్కు కోసం పోరాటం చేస్తే, బ్రిటిష్ వారు వారిని విద్రోహిగా చిత్రీకరించారన్నారు. అయితే, నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. బిర్స ముండపై ఉన్న విద్రోహి అనే పేరును తొలగించి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అదే విధంగా మన్యం దొరగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు గారు గొప్ప స్వాతంత్ర్య యోధుడు అని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

కాగా, తన అద్భుతమైన నటనతో సీతారామరాజుని తెలుగు ప్రజల గుండెల్లో చేర్చిన సూపర్ స్టార్ కృష్ణకు ‘glow art’ సీతారామరాజు చిత్ర పాఠాన్ని బహుకరించి, సన్మానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను నాలుగు సార్లు చూసానని, చాలా అద్భుతంగా దానిని తెరకెక్కించారని కిషన్ రెడ్డి కొనియాడారు. ‘‘మన తెలుగు వారికి మనం ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి అని.. కేంద్రంతో, మోదీతో, అమిత్ షా తో మాట్లాడాను.. అలా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన వాళ్లకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి. బ్రిటిష్ వారితో పోరాటం చేసిన వారు అనగానే.. మన తెలుగు వాళ్లలో అల్లూరి సీతారామరాజు గారి పేరే ముందుగా మనకు గుర్తువస్తుంది. కేవలం జయంతి మాత్రమే కాదు.. వర్ధంతి, మిగిలిన కార్యకమాలను కూడా ఏర్పాటు చేయాలి. Unsung heroes వీరోచిత గాథలను భావితరాలకు తెలియజేయాలి.’’ అని కిషన్ రెడ్డి అన్నారు.

అల్లూరి గురించి భావితరాల వారు తెలుసుకునేందుకు రూ. 38 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. రూ. 18 కోట్లతో హైదరాబాద్ లో కుడా మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైందని, ఇప్పటికే కోటి రూపాయలు విడుదల చేయడం జరిగిందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి వాళ్ళ గాథలు అందరికీ తెలియాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. అలాగే ఢిల్లీలో కూడా ఒక అద్భుతమైన కార్యక్రామాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీనికి కేంద్రం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. ‘‘ఇది మన దేశం, మనల్ని పరిపాలించడానికి బ్రిటిష్ వారు ఎవరు.. అని మన్నెం ప్రజలతో కలిసి బ్రిటిష్ వారిపై యుద్ధం చేశారు సీతారామరాజు..’’ అని కీర్తించారు.

ఏపీ పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహానుభావుడైన అల్లూరి సీతారామ రాజు చరిత్ర పాఠ్యపుస్తకాలలో ప్రచురం అవ్వాలని అన్నారు. దానికి తాము కృషి చేస్తూనే ఉంటామని చెప్పారు. గెరిల్లా యుద్ధంలో నేను వస్తున్నా అని ముందుగానే చెప్పి, వెళ్లిన సీతారామరాజు.. గెరిల్లా యుద్ధం చరిత్రలోనే గుర్తిండిపోయేది అని పేర్కొన్నారు. రాబోయే తరాలకు అల్లూరి సీతారామరాజు గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇకపోతే కోవిడ్ సమయంలోనూ ఈ కార్యక్రమానికి హాజరైన సీతారామరాజు ‘కృష్ణ’కు మంత్రి అవంతి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

నిద్ర పోకుండా విగ్రహాన్ని చేయించాలి.. ఈ వేడుకల్లో పాల్గొన్న నటుడు మోహన్ బాబు కూడా అల్లూరి సీతారామరాజును కీర్తించారు. అల్లూరి చరిత్ర భావితరాలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకు మంచి స్నేహితుడు అని చెప్పారు. ఎందరో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను చూశాం కానీ, కిషన్ లాంటి ప్రజాప్రతినిధులు అరుదు అని అన్నారు. ఆయన మాట ఇస్తే తప్పరని చెప్పారు. అల్లూరు విగ్రహ స్థాపన పూర్తయ్యే వరకు కిషన్ రెడ్డి నిద్ర పోవద్దని అన్నారు. ఇదిలాఉంటే.. రాజులు చాలా గొప్పవాళ్లు అని మోహన్ బాబు ప్రశంసించారు. రాజుల నవనాడుల్లో రాజకీయం, రాజ నీతి ఉంటుందన్నారు. నటుడు కృష్ణం రాజు షూటింగ్‌కి వస్తూ 10 మందికి భోజనం తెచ్చేవారని నాటి రోజులను గుర్తు చేశారు. అదేమంటే.. తాము రాజులం అని చెప్పేవారన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ తీసిని చాలా సినిమాలకు తాను అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశానని మోహన్ బాబు తెలిపారు. కృష్ణ చాలా సైలెంట్‌గా ఉంటారని, వాళ్ల ముగ్గురు అన్నదమ్ములు చాలా మంచి వారని చెప్పుకొచ్చారు. తనను ఆ రోజుల్లో పెద్ద హీరో అవుతావంటూ ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. ఇతరుల శ్రేయస్సు కోరుకునే వారు సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ, ఒక్క కారెక్టర్ ఇవ్వాలని అడిగానన్నారు. దాంతో తనకు ఆ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారన్నారు. ఈ వయస్సులో కూడా కృష్ణ చాలా యాక్టీవ్‌గా ఉంటారని అన్నారు. కృష్ణ వల్లే సీతారామరాజు గురించి ఇప్పటికీ జనాలు మాట్లాడుకుంటున్నారని, అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలిపామన్నారు.

చివరగా నటుడు కృష్ణ మాట్లాడుతూ.. తాను ఎన్ని సినిమాలు నటించినా తన జీవితంలో నెంబర్ 1 గా నిలిచిపోయే చిత్రం ‘సీతారామరాజు’ మాత్రమే అని పేర్కొన్నారు.

Kishan Reddy 2

Also read:

Tirumala Temple: ఇలా అయితేనే తిరుమలకు రండి.. వైకుంఠ ఏకాదశి వేళ టీటీడీ కీలక ప్రకటన..

Aliens: భూమి నగరాలు, వనరులపై ఏలియన్స్ దాడి..? వివిధ రూపాల్లో రెక్కీలు నిర్వహిస్తున్నారంటున్న ప్రొఫెసర్..

Early Election: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రచ్చ.. ముందస్తు ప్రచారంపై అధికార పక్షాల ఫైర్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu