Aliens: భూమి నగరాలు, వనరులపై ఏలియన్స్ దాడి..? వివిధ రూపాల్లో రెక్కీలు నిర్వహిస్తున్నారంటున్న ప్రొఫెసర్..

Aliens turns Asteroids: గ్రహశకలాలను బాంబులుగా మార్చి గ్రహాంతరవాసులు భూమి మీద దాడులు చేస్తారని..  నగరాలను, భూమి మీద ఉన్న  అన్ని వనరులను నాశనం చేస్తారని..

Aliens: భూమి నగరాలు, వనరులపై ఏలియన్స్ దాడి..? వివిధ రూపాల్లో రెక్కీలు నిర్వహిస్తున్నారంటున్న ప్రొఫెసర్..
Aliens Could Turn Asteroids
Follow us

|

Updated on: Jan 02, 2022 | 5:44 PM

Aliens turns Asteroids: గ్రహశకలాలను బాంబులుగా మార్చి గ్రహాంతరవాసులు భూమి మీద దాడులు చేస్తారని..  నగరాలను, భూమి మీద ఉన్న  అన్ని వనరులను నాశనం చేస్తారని ఓ ప్రొఫెసర్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. యుఎఫ్‌ఓల ద్వారా గ్రహాంతరవాసుల దాడులకు ముందు భూమిని తనిఖీ చేస్తారని నిపుణుడు పేర్కొన్నారు. అలబామాలో US ఎయిర్ కమాండర్ , స్టాఫ్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ పాల్ స్ప్రింగ్ సన్ ఆన్‌లైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రొఫెసర్ స్ప్రింగర్ UFOలు, గ్రహాంతరవాసుల గురించి మాట్లాడిన విషయాలను జూన్‌లో పెంటగాన్ ఒక నివేదికను ప్రచురించింది. అందులో అమెరికా స్కైస్‌లో గుర్తించబడని ఎగిరే వస్తువుల గురించి సమాచారం తెరపైకి వచ్చిందని, అయితే అది ఏమిటో తాను ఇప్పుడు చెప్పలేనని అన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ సంఘటనపై కాంగ్రెస్, సెనేట్  దర్యాప్తు చేయడానికి కొత్త UFO కార్యాలయం కోసం ప్రణాళికలను రెడీ చేయాలని పేర్కొంది.

అమెరికాపై గ్రహాంతర వాసులు దాడి చేస్తే 300 ఏళ్ల క్రితం అమెరికాపై యూరోపియన్లు చేసినట్లే ఉంటుందని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. గ్రహాంతర వాసులు సంచార జీవుల వలె వనరుల కోసం భూమిని వెతుకుతారని ఆయన అన్నారు.

లేజర్ లేదా గైడెడ్ ఆస్టరాయిడ్స్ ద్వారా భూమిపై ఉన్న అణ్వాయుధాలను గ్రహాంతర వాసులు నాశనం చేయవచ్చని ప్రొఫెసర్ చెప్పారు. అంతేకాదు.. మానవ నాగరికతను నాశనం చేయడానికి గ్రహాంతరవాసులు వైరస్లను కూడా పంపవచ్చనని సంచలన వ్యాఖ్యలు చేశారు.  గ్రహాంతరవాసులు తమ ఆయుధాలను తయారు చేసుకునేందుకు మమ్మల్ని సంప్రదించాలనుకునే అవకాశం కూడా ఉందన్నారు.

ప్రొఫెసర్ పాల్ స్ప్రింగర్ ఇంకా మాట్లాడుతూ… ఎవరైనా మన మీద దాడి చేస్తే దానిని నివారించడానికి సైన్యానికి అనేక అప్షన్లు ఉంన్నాయి. అయితే అదే ఏలియన్స దాడి చేస్తే.. వారి సాంకేతికతను పట్టుకోవడం అసాధ్యమని అన్నారు. 340 అడుగుల వెడల్పు ఉన్న గ్రహశకలం భూమి వైపు వేగంగా కదులుతున్నప్పుడు ప్రొఫెసర్ ఈ వాదనను వినిపించారు.

Also Read:  పాకిస్తాన్‌పై ఉగ్రదాడులతో విరుచుకుపడుతున్న తాలిబన్లు.. షాకింగ్ రిపోర్ట్..