AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Terror Attacks: పాకిస్తాన్‌పై ఉగ్రదాడులతో విరుచుకుపడుతున్న తాలిబన్లు.. షాకింగ్ రిపోర్ట్..

Pakistan Terror Attacks: పాముని ప్రేమగా పాలు పోసి పెంచుకున్నా.. అది విషం చిమ్ముతుంది.. అదే విధంగా తాలిబన్లు కూడా తమను పెంచి పోషించినవారిపైనే తిరిగి దాడి చేస్తారని పలు నివేదికల..

Pakistan Terror Attacks: పాకిస్తాన్‌పై ఉగ్రదాడులతో విరుచుకుపడుతున్న తాలిబన్లు.. షాకింగ్ రిపోర్ట్..
Terror Attacks Increased In
Surya Kala
|

Updated on: Jan 02, 2022 | 5:11 PM

Share

Pakistan Terror Attacks: పాముని ప్రేమగా పాలు పోసి పెంచుకున్నా.. అది విషం చిమ్ముతుంది.. అదే విధంగా తాలిబన్లు కూడా తమను పెంచి పోషించినవారిపైనే తిరిగి దాడి చేస్తారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. తాజాగా పాకిస్తాన్ కు చెందిన పలు వార్త పత్రికలు ఆఫ్ఘనిస్తాన్‌ ని తాలిబన్లు ఆక్రమించడం వలన పాకిస్తాన్‌కు చెడుజరిగిందని వార్త కథనాలను రాస్తున్నాయి. నిజానికి ఈ ఉగ్రవాద సంస్థ ప్రభుత్వంపై పాకిస్తాన్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాలిబాన్లకు డబ్బు సహాయంతో సహా   ఆశ్రయం కల్పించడం వంటి అనేక పలు చేసింది. అయితే గతేడాది 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న వెంటనే పాకిస్థాన్‌లో తీవ్రవాద దాడులు పెరిగిపోయాయి. ఆగస్టు నెల నుంచి పాకిస్తాన్‌లో జరిగిన ఉగ్ర దాడులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

2017 తర్వాత అత్యధిక ఉగ్ర దాడులు:

పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీ (PICSS) పాక్ లోని పరిస్థితులపై అధ్యయనం  చేసింది. 2021 సంవత్సరంలో ఆగష్టు నెలలో అత్యధిక సంఖ్యలో దాడులు నమోదయ్యాయని.. ఉగ్రవాదులు 45 సార్లు దాడులకు పాల్పడ్డారని ఈ నివేదిక ర్కొంది. స్థానిక వార్తాపత్రిక డాన్ ప్రకారం.. నవంబర్ 10 నుండి డిసెంబర్ 10 వరకు కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ.. ఉగ్రవాద దాడుల సంఖ్య తగ్గలేదని PICSS తన నివేదికలో పేర్కొంది. పాకిస్తాన్‌లో ప్రతి నెలా సగటు ఉగ్రవాద దాడుల సంఖ్య 2020లో 16 ఉండగా అది 2021లో 25కి పెరిగిందని.. 2017 తర్వాత ఇదే అత్యధికమని వార్తాపత్రిక పేర్కొంది.

103 దాడులు  170 మంది మృతి:  పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ లోని ప్రావిన్స్ అత్యంత ఉగ్రవాద బాధిత ప్రాంతమని పేర్కొంది. ఇక్కడ 103 దాడులు జరగగా..  170 మంది మరణించారని నివేదిక పేర్కొంది. అంతేకాదు గాయపడిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారని తెలిపింది. దేశం మొత్తంలో ఉగ్ర దాడుల్లో గాయపడిన వారిలో 50 శాతానికి పైగా ఈ ప్రావిన్స్‌లో దాడులకు గురైనవారే. బలూచిస్థాన్ తర్వాత అత్యధికంగా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతం ఖైబర్ పఖ్తుంఖ్వా అని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ జోక్యంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ తాలిబాన్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తోందని.. ఇది ప్రాంతీయ సంఘర్షణను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం పాకిస్థాన్ లో ఈ పరిస్థితి నెలకొనడానికి కారణం నేతల వ్యక్తిగత ప్రయోజనాలే అంటూ నిపుణులు ఆరోపణలు  వ్యాఖ్యానిస్తున్నారు.  దేశంలో ఎన్ని ఉగ్ర దాడులు జరిగినా, తాలిబన్ల పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తోంది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా అనేక సందర్భాల్లో తాలిబాన్ ప్రతినిధిలా మాట్లాడటం కనిపిస్తుందని ఇది దేశానికి మంచిది కాదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: ‘కరోనాను, ఏపీ ప్రభుత్వాన్ని ఏం చెయ్యలేం’.. మరోసారి వర్మ ఘాటు కామెంట్స్