AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆకాశం నుంచి చేపల వర్షం… సంభ్రమాశ్చర్యాలకు లోనైన జనం

చేపల వర్షం గురించి చాలామంది విని ఉంటారు. కానీ చూసినవాళ్లు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. తాజాగా ఈ క్రేజీ సీన్ మరోచోట కనిపించింది

Viral: ఆకాశం నుంచి చేపల వర్షం... సంభ్రమాశ్చర్యాలకు లోనైన జనం
Fish Rain
Ram Naramaneni
|

Updated on: Jan 02, 2022 | 4:24 PM

Share

చేపల వర్షం గురించి చాలామంది విని ఉంటారు. కానీ చూసినవాళ్లు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. మాములుగా అయితే భారీ వర్షాలు కురిసినప్పుడు.. వరదల కారణంగా కాలువలు, చెరువుల నుంచి చేపలు, పాములు కొట్టుకుని వస్తాయి. ఇది చాలా కామన్‌గా కనిపించే సీన్.  కానీ టెక్సాస్‌లో తుపాను కారణంగా కురిసిన వానకు ఆకాశం నుంచి చేపలు పడ్డ వింత సంఘటన జరిగింది. ఈ మేరకు చేపల వర్షం కురిసిందంటూ టెక్సాస్‌ నగరం ఫేస్‌బుక్‌లో ఒక ఫోటో కూడా పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. “అబ్బా మా ఏరియాలో కూడా ఇలాంటి వర్షం పడితే బాగుండు” అని ఒకరంటే..  “డబ్బుల వర్షం కూడా కురిపించు దేవుడా” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

ఈ చేపల వాన వెనకు ఒక సైంటిఫిక్ థియరీ  చెబుతున్నారు. ఆకాశం నుంచి కింద పడే చేపలు… నిజంగా ఆకాశం నుంచి ఊడి పడవంట.  వాతావరణ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల ప్రకారం వాతావరణంలోని మార్పుల వల్ల టోర్నడోలు ఏర్పడతాయి. ఈ టోర్నడోలు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇవి నీటిపై ప్రయాణించే సమయంలో ఆ నీటిని అపరమితమైన శక్తితో పైకి లాగుతాయి. చేపలు, కప్పలు వంటి సముద్ర జీవులు కూడా టోర్నడోలతో పాటుగా పైకి ప్రయాణిస్తాయి. కొంచెం సేపు ప్రయాణించిన తర్వాత ఈ టోర్నడోలు బలహీనమవుతాయి. అప్పుడు చేపలు వర్షంతో కలిసి కిందికి పడతాయి. కాగా టోర్నడోలు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అంతే తప్ప ఆకాశంలో చేపలు ఉండటం, అవి వర్షంతో పాటు పడటం జరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read:  Manchu Family: చిరు వ్యాఖ్యల అనంతరం మంచు ఫ్యామిలీ నుంచి సెన్సేషనల్ న్యూస్!

Telangana: కిలో మటన్‌ కొను.. అదిరిపోయే గిఫ్ట్‌ పట్టు.. వ్యాపారి క్రేజీ ఆఫర్..