Huge fish like stone: అరుదైన పెద్ద చేప సన్‌ ఫిష్‌.. ఒకేసారి 30 కోట్ల గుడ్లు పెట్టడం దీని ప్రత్యేకత.. (వీడియో)

అది ఒక భారీ చేప.. చూడ్డానికి పెద్ద రాయిలాగా ఉంటుంది. తెలుపు, గ్రే, బ్రౌన్‌, గోల్డెన్‌ కలర్స్‌లో ఈ చేపలు ఉంటాయి. దీనికి రెక్కలు కూడా ఉంటాయి. అందుకే దాన్ని చూసిన కొందరు షార్క్‌ ఫిష్‌ అనుకుంటారు. ఆ రెక్కలు లేకపోతే బండరాయే అనుకుంటారు. ఈ చేప కళ్లు పెద్దగా మెరుస్తూ ఉంటాయి.

Huge fish like stone: అరుదైన పెద్ద చేప సన్‌ ఫిష్‌.. ఒకేసారి 30 కోట్ల గుడ్లు పెట్టడం దీని ప్రత్యేకత.. (వీడియో)

|

Updated on: Jan 02, 2022 | 9:43 AM


అది ఒక భారీ చేప.. చూడ్డానికి పెద్ద రాయిలాగా ఉంటుంది. తెలుపు, గ్రే, బ్రౌన్‌, గోల్డెన్‌ కలర్స్‌లో ఈ చేపలు ఉంటాయి. దీనికి రెక్కలు కూడా ఉంటాయి. అందుకే దాన్ని చూసిన కొందరు షార్క్‌ ఫిష్‌ అనుకుంటారు. ఆ రెక్కలు లేకపోతే బండరాయే అనుకుంటారు. ఈ చేప కళ్లు పెద్దగా మెరుస్తూ ఉంటాయి. దీని తల కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఇది ఎక్కువగా పసిఫిక్‌, అట్లాంటిక్‌ మహాసముద్రాల్లో పెరుగుతాయి. బరువైన ముళ్లు కలిగిన రెండో చేపగా దీన్ని చెబుతారు. వీటిలో ఆడ చేపలు ఒకేసారి 30 కోట్ల గుడ్లు పెడతాయి. వీటిని జపాన్‌, తైవాన్‌, కొరియా దేశస్తులు బాగా తింటారు. అందుకే ఇవి అక్కడికి ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇవి జెల్లీ ఫిష్‌, స్క్విడ్‌ లాంటివి తింటాయి. వీటిని ఎటు చూసినా ఒకేలా.. పవర్‌ ఫిష్‌లా ఉబ్బినట్లు ఉంటాయి. ఇటీవల ఈ చేప కాలిఫోర్నియాలోని లాగునా బీచ్‌లో ఓ పాడిల్‌ బోర్డర్‌కి కనిపించింది. ఇంతకీ ఇదేం చేపో చెప్పలేదు కదా… దీని పేరు సన్‌ ఫిష్‌.. ఎందుకంటే ఇది ఎక్కువగా సముద్రంలో ఎప్పుడూ నీటిపైన తేలుతూ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సన్‌ బాత్‌ చేస్తుందన్నమాట. అదే దానికి ఇష్టమట కూడా.

Follow us