Viral Video: కాళ్లు లేని కుక్క‌ను.. మ‌ళ్లీ న‌డిచేలా చేసిన యువ‌కుడు..! వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: కాళ్లు లేని కుక్క‌ను.. మ‌ళ్లీ న‌డిచేలా చేసిన యువ‌కుడు..! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jan 02, 2022 | 9:15 AM

ఓ యువ‌కుడి సృజ‌నాత్మ‌క అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. పాలస్తీనాలోని గాజా సిటీలో జంతువుల ప‌రిర‌క్ష‌క శిబిరంలోని ఓ కుక్క అనారోగ్యానికి గురై రెండు కాళ్లు క‌ద‌ల‌ని ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో అందులో ప‌నిచేసే యువ‌కుడు అల్ అయీర్‌..


ఓ యువ‌కుడి సృజ‌నాత్మ‌క అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. పాలస్తీనాలోని గాజా సిటీలో జంతువుల ప‌రిర‌క్ష‌క శిబిరంలోని ఓ కుక్క అనారోగ్యానికి గురై రెండు కాళ్లు క‌ద‌ల‌ని ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో అందులో ప‌నిచేసే యువ‌కుడు అల్ అయీర్‌.. కుక్క‌ తిరిగి స్వ‌యంగా న‌డిచేలా చేయాల‌ని అనుకున్నాడు.చిన్నారులు ఆడుకునే సైకిల్ వెనుక భాగాన్ని కుక్కకు క‌ట్టి ఆ జంతువు మ‌ళ్లీ న‌డిచేలా చేశాడు. ఆ కుక్క పేరు లూసీ అని ప‌క్ష‌వాతంతో దాని వెనుక కాళ్లు రెండూ ప‌నిచేయ‌డం లేద‌ని ఆ యువ‌కుడు చెప్పాడు. లూసీనీ అత‌డు తిరిగి న‌డిచేలా చేసిన తీరుపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ ఆలోచ‌న అద్భుతమ‌ని జంతు ప్రేమికులు అభినందిస్తున్నారు.