Two planes destroyed video: ఇరాక్ గ్రీన్‌జోన్‌పై రాకెట్ దాడి.. రెండు విమానాలు ధ్వంసం..!(వీడియో)
అమెరికా రాయబార కార్యాలయం ఉన్న బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌పై రాకెట్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఇరాక్ సైన్యం తెలిపింది. రాయబార కార్యాలయం వద్ద ఉన్న రక్షణ వ్యవస్థ ఒక రాకెట్‌ను ధ్వంసం చేసిందని,
అమెరికా రాయబార కార్యాలయం ఉన్న బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌పై రాకెట్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఇరాక్ సైన్యం తెలిపింది. రాయబార కార్యాలయం వద్ద ఉన్న రక్షణ వ్యవస్థ ఒక రాకెట్‌ను ధ్వంసం చేసిందని, మరో రాకెట్ జాతీయ స్మారక చిహ్నం సమీపంలో పడగా రెండు విమానాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై ఇరాక్ భద్రతా దళాలు దర్యాప్తును ప్రారంభించాయి.గ్రీన్‌జోన్‌లో అమెరికా రాయబార కార్యాలయంతో పాటు ఇతర విదేశీ దౌత్య కార్యాలయాలు, ఇరాక్ ప్రభుత్వ భవనాలున్నాయి. ఇటీవల ఈ జోన్‌పై తరుచూ డ్రోన్, రాకెట్ దాడులు చోటు చేసుకుంటున్నాయి. రాకెట్ దాడిని ఇరాన్ మద్దతుగా ఇరాకీ మిలీషియా గ్రూపుల పనేనని అమెరికా మండిపడింది.
వైరల్ వీడియోలు
Latest Videos