Lock down: మళ్లీ లాక్‌డౌన్ ఒమిక్రాన్ వ్యాప్తి పెరగడంతో నిర్ణయం.. జనవరి 14 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ (వీడియో)
నెదర్లాండ్స్‌కు మళ్లీ లాక్ పడింది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో మహమ్మారి ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వం డిసెంబర్18 నుంచి లాక్‌డౌన్ విధించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని మార్క్ రుట్టే ప్రకటించారు.
నెదర్లాండ్స్‌కు మళ్లీ లాక్ పడింది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో మహమ్మారి ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వం డిసెంబర్18 నుంచి లాక్‌డౌన్ విధించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని మార్క్ రుట్టే ప్రకటించారు. ఈ నిర్ణయంతో నెదర్లాండ్స్ మరోసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. ఊహకందని రీతిలో ఒమిక్రాన్ వ్యాపిస్తుండటంతో అక్కడ లాక్‌డౌన్ తప్పనిసరైంది. ఈ లాక్‌డౌన్ డిసెంబర్ 19 ఉదయం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. కఠిన నిబంధనలతో ఈ లాక్‌డౌన్ నూతన సంవత్సరం జనవరి 14 వరకు అమల్లో ఉంటుంది. ఐదో వేవ్ చేరువ అవుతున్న తరుణంలో లాక్‌డౌన్ అనివార్యమైనట్లు రుట్టే తెలిపారు.ముఖ్యమైన షాపులు తప్ప, మిగతా అన్ని షాపులు, విద్యా సంస్థలు, రెస్టారెంట్‌లు, మ్యూజియంలు, థియేటర్‌లు, జూపార్కులు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించింది. డిసెంబర్ 16, 17 తేదీల్లో దాదాపు 14,742 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. క్రిస్మస్ తర్వాత ఇది మరింత పెరగవచ్చని హెచ్చరించారు. కాగా డిసెంబర్ 14న నెదర్లాండ్స్‌లో కొన్ని ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే! తాజాగా వాటిని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఐతే ఒమిక్రాన్‌ను అడ్డుకోవాలంటే ఈ ఆంక్షలు సరిపోవని భావించిన డచ్ ప్రభుత్వం ఈ ప్రకటన జారీ చేసిన నాలుగు రోజులకే తాజాగా సంపూర్ణ లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంది.