AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Foods: చలికాలంలో ఇమ్యూనిటీ పెరగడానికి 10 సూపర్ ఫుడ్స్‌.. అవేంటంటే..?

Super Foods:శీతాకాలంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజల కష్టాలను మరోసారి పెంచింది. ఈ పరిస్థితులలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం

Super Foods: చలికాలంలో ఇమ్యూనిటీ పెరగడానికి 10 సూపర్ ఫుడ్స్‌.. అవేంటంటే..?
Super Foods
Follow us
uppula Raju

|

Updated on: Jan 02, 2022 | 6:44 PM

Super Foods:శీతాకాలంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజల కష్టాలను మరోసారి పెంచింది. ఈ పరిస్థితులలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకోసం రోజువారీ డైట్‌లో కొన్ని సూపర్‌ఫుడ్‌లను యాడ్ చేసుకోవాలి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాంటి పది రకాల ఆహారాల గురించి తెలుసుకుందాం.

1. చిలగడదుంప ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. విటమిన్ సిని అందిస్తుంది.

2. ఉసిరి ఉసిరి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధులను దూరం చేస్తుంది. ఇందులో పోషకాలు అద్భుతం. మీరు ఊరగాయ, రసం, చట్నీ లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు.

3. ఖర్జూర ఖర్జూరాలను కేకుల నుంచి షేక్స్ వరకు అన్నిటిలో ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం పుష్కలంగా ఉండే ఖర్జూరం ఎముకలు, దంతాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలను నివారించవచ్చు.

4. బెల్లం ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకారం.. కషాయాల రూపంలో బెల్లం తీసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఫ్లూ, జలుబు వంటి వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. బెల్లం ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, పొటాషియం వంటి అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఇన్ఫెక్షన్‌లను దూరం చేయడంలో ఇది సహాయపడుతుంది.

5. రాగులు ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇందులో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాగులను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో ఉండే అమినో యాసిడ్‌లు ఆకలిని తగ్గిస్తాయి. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, రాగులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

6. బ్రోకలీ బ్రోకలీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే పోషకాల పవర్‌హౌస్. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక కప్పు బ్రోకలీ ఆరెంజ్‌కి సమానమైన విటమిన్ సిని ఇస్తుంది. బ్రకోలీలో బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీని ఉడకబెట్టి తినడం ఉత్తమ మార్గం.

7. అల్లం ఇందులో ఆక్సిడేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చలికాలంలో గొంతు నొప్పిని నయం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్, జీర్ణ సమస్యలు వికారం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అల్లం వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది.

8. వాల్నట్ వాల్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అదనంగా వాల్‌నట్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

9. వేరుశనగ వేరుశెనగలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

10. పండ్లు పండ్లలో విటమిన్లు, ప్రొటీన్స్‌ అధికంగా ఉంటాయి. ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తప్పకుండా తీసుకోవాలి. ప్రతిరోజు పండ్లు తింటే వైద్యుడి వద్దకు వెళ్లే అవసరం ఉండదు.

కరోనా టైంలో పెరిగిన బ్యాడ్‌ హ్యాబిట్స్‌.. మద్యం, సిగరెట్లకు బానిసలైన యువత..

బూస్టర్‌ డోస్‌ గురించి శుభవార్త.. ఒమిక్రాన్‌పై 88% ప్రభావం.. UK అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..

Air Travel: విమాన ప్రయాణం ఖరీదు.. జెట్‌ ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి.. లీటర్‌కి ఎంత పెరిగిందంటే..?