Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea: చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా.. దీని వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది.. అదేంటో తెలుసా..

శీతాకాలంలో వేడివేడి అమృతం అంటే మీకు ముందుగా గుర్తుకువచ్చేది.. చాయ్! లేవగానే కాసిన్ని తే నీరు కడుపులో పడందే రోజు రోజులా మొదలు కాదు. ఇక్కడా, అక్కడా అని కాదు ఎక్కడైనా టీ అంటే..

Tea: చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా.. దీని వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది.. అదేంటో తెలుసా..
Brits Put Milk In Their Tea
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 02, 2022 | 7:49 PM

శీతాకాలంలో వేడివేడి అమృతం అంటే మీకు ముందుగా గుర్తుకువచ్చేది.. చాయ్! లేవగానే కాసిన్ని తే నీరు కడుపులో పడందే రోజు రోజులా మొదలు కాదు. ఇక్కడా, అక్కడా అని కాదు ఎక్కడైనా టీ అంటే అదే అమృతం. నీళ్ల తర్వాత ఇంత ఎక్కువగా తాగే హాట్ వాటర్ చాయ్.. తప్ప మరొకటి కాదు. నీళ్లలాగే ఇంత చవకగా దొరికే ద్రవం కూడా చాయ్ తప్ప మరొకటి కాదు. అందుకే అది ప్రపంచ డ్రింకు హోదా దాని సొంతం. 80ల నాటి సినిమాల్లో టేబుల్‌పై ఉంచిన టీలో పాలు విడివిడిగా పోయడం తరచుగా కనిపిస్తుంది. ఇది ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా ఇంట్లో తయారుచేసే టీకి పాలు కలుపుతారు. అది మరిగించి.. ఆ తర్వాత అందులో టీ కలుపుతారు. వాస్తవానికి టీలో పాలు విడిగా పెట్టడం బ్రిటన్ నుండి ప్రారంభమైంది.

కానీ ఇలా చేయడం వెనుక ఉద్దేశం రుచిని పెంచడం లేదా తగ్గించడం కాదు. బ్రిటన్‌లో ఈ ప్రత్యేకమైన టీ తయారీ విధానం ఎలా మొదలైందో తెలుసుకుందాం. బ్రిటన్‌లో ఈ విధంగా టీ తయారుచేసే ట్రెండ్ 18వ శతాబ్దంలో మొదలైంది. ఆ రోజుల్లో టీ కుండలలో తయారు చేసేవారు. చైనీస్ కప్పులు టీ త్రాగడానికి ఉపయోగించడం మొదలు పెట్టారు. అయితే ఈ కప్పులకు కూడా ఒక లోపం ఉండేది. ఈ కప్పుల్లో వేడి.. వేడి చాయ్ అందులో పోయడంతోనే ఆ కప్పు పగిలిపోయేది. 

బ్రిటన్‌లో చక్కెర కప్పు పగిలిపోకుండా కాపాడేందుకు అక్కడి చాయ్ ప్రియులకు తట్టిన ఓ ఐడియా ఇందుకు కారణంగా మారింది. జుగాద్ కింద మొదట కప్పులో పాలు పోస్తారు. ఆ తర్వాత పై నుండి కప్పులో టీ పోస్తారు. ఇలా చేయడం ద్వారా కప్పులోకి చేరిన పాలు.. టీ ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. కప్పు పగిలిపోకుండా.. అలా ఈ ట్రెండ్ మొదలైంది.

ఆ సమయంలో టీ ఖరీదైన పానీయంగా మారింది. ప్రపంచంలో ఎక్కువ శాతం జనాభ ఇంకా పేదరికంలోనే ఉంది. చైనీస్ కప్పు పగలడంతో మళ్లీ టీ సిద్ధం చేయడం వారికి అంత సులభం కాదు. ఫలితంగా టీ తయారుచేసే ఈ పద్ధతి అమలులోకి వచ్చింది. నెమ్మదిగా ఈ పద్దతి ప్రపంచ మంతా వ్యాపించింది.

విశేషమేమిటంటే.. అప్పట్లో బోన్ చైనా కప్పులు కూడా ఉండేవి.. కానీ అవి చాలా ఖరీదుగా ఉండడంతో సామాన్యులు కొనడం కష్టతరంగా ఉండడంతో విడిగా పాలు కలిపే ట్రెండ్ మొదలైంది. ఒక నివేదిక ప్రకారం.. ఇలా చేయడం ద్వారా, టీ టేస్ట్ కూడా పెరిగింది.  

ఇవి కూడా చదవండి: Early Election: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రచ్చ.. ముందస్తు ప్రచారంపై అధికార పక్షాల ఫైర్..

Viral Video: వామ్మో..! ఇది మైకేల్ జాక్సన్‌ను మించిపోయిందే.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న పావురం డ్యాన్స్..

వచ్చే ఏడాది IPLలో ఆడతా..: పాకిస్థాన్‌ క్రికెటర్
వచ్చే ఏడాది IPLలో ఆడతా..: పాకిస్థాన్‌ క్రికెటర్
ఇంట్లో వాస్తు దోషం ఉంటే అద్డంతో చెక్ పెట్టండి? ఎలా ఉపయోగించాలంటే
ఇంట్లో వాస్తు దోషం ఉంటే అద్డంతో చెక్ పెట్టండి? ఎలా ఉపయోగించాలంటే
సినిమాల్లోకి హీరోయిన్ మధు బాల కుమార్తెలు! లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
సినిమాల్లోకి హీరోయిన్ మధు బాల కుమార్తెలు! లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
ఈ రాళ్లను కదిలిస్తే సరిగమలు పాడతాయ్.. ఎక్కడో తెల్సా
ఈ రాళ్లను కదిలిస్తే సరిగమలు పాడతాయ్.. ఎక్కడో తెల్సా
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి
వేసవిలో పెరుగు కమ్మగుండాలంటే ఇలా చేసి చూడండి
వేసవిలో ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాల్సిందే
వేసవిలో ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాల్సిందే
15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా
15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా
మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..
మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..
అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే
అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే